Srinu Vaitla : ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం కలిగింది.
- By Hashtag U Published Date - 08:38 AM, Sun - 28 November 21
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీను తండ్రి వైట్ల కృష్ణారావు(83) ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలోనే నేటి తెల్లవారుజామున కృష్ణారావు తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబం తీవ్ర విషాదంతో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లను ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నారు.