Srileela : కిసిక్ సాంగ్ ఎందుకు చేశానో ఆరోజు తెలుస్తుంది.. శ్రీలీల నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్..!
Srileela పుష్ప 2 లో అల్లు అర్జున్ తో డ్యాన్స్ చేయడం లక్కీగా ఫీల్ అవుతున్న శ్రీలీల కిసిక్ సాంగ్ మీద మరింత అంచనాలు పెంచేస్తుంది. ముఖ్యంగా తను ఆ సాంగ్ గురించి
- By Ramesh Published Date - 03:15 PM, Wed - 27 November 24

టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం చకచకా సినిమాలు చేసి తన సత్తా చూపించిన శ్రీలీల చేసిన సినిమాలు కొన్ని నిరాశ పరచడంతో కాస్త దూకుడు తగ్గించింది. ప్రస్తుతం నితిన్ తో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్న శ్రీలీల పుష్ప 2 లో కిసిక్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఐతే రాబిన్ హుడ్ సినిమా ప్రెస్ మీట్ లో కిసిక్ సాంగ్ అందరు అనుకున్నట్టుగా జస్ట్ ఐటం సాంగ్ కాదని అదేంటి అన్నది తెలియాలంటే డిసెంబర్ 5 దాకా ఆగాల్సిందే అని అన్నది శ్రీలీల.
పుష్ప 2 లో అల్లు అర్జున్ (Allu Arjun) తో డ్యాన్స్ చేయడం లక్కీగా ఫీల్ అవుతున్న శ్రీలీల కిసిక్ సాంగ్ (Kissik Song) మీద మరింత అంచనాలు పెంచేస్తుంది. ముఖ్యంగా తను ఆ సాంగ్ గురించి అంత కాన్ఫిడెంట్ గా చెబుతుంది అంటే అల్లు అర్జున్ తో కలిసి డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోయేలా చేసినట్టు ఉంది. అసలే శ్రీలీల డ్యాన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది.
ఉ అంటావా సాంగ్..
అందులో పుష్ప 2లో స్పెషల్ సాంగ్ అంటే అదరగొట్టేసి ఉంటుంది. ఐతే పుష్ప 1 లో Samantha ఉ అంటావా సాంగ్ ఉ అంటావా సాంగ్ కిసిక్ సాంగ్ కూడా ఇన్ స్టంట్ హిట్ కాగా సినిమా లో ఈ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుంది అని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. మరి శ్రీలీల (Srileela)కు పుష్ప 2 లో ఈ సాంగ్ ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.
అంతకుముందు చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వచ్చినా తాను మాత్రం చేయలేదని పుష్ప 2 లో ఎందుకు చేశానో సినిమా చూస్తే తెలుస్తుందని అంటుంది శ్రీలీల.
Also Read : Imanvi : ప్రభాస్ హీరోయిన్ డేట్స్ బ్లాక్ చేసిన నిర్మాతలు..!