Imanvi : ప్రభాస్ హీరోయిన్ డేట్స్ బ్లాక్ చేసిన నిర్మాతలు..!
Imanvi ఈ సినిమా ఓపెనింగ్ అవ్వడమే ఆలస్యం ఇమాన్వికి చాలా ఆఫర్లు వచ్చాయట. అందులో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఫౌజి సినిమా
- By Ramesh Published Date - 03:04 PM, Wed - 27 November 24

రెబల్ స్టార్ తో ఫౌజీ సినిమాలో జత కడుతున్న బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ డేట్స్ ని ఆ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఏడాది పాటు బ్లాక్ చేసినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో తన డ్యాన్స్ తో సూపర్ ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న ఇమాన్వి హను రాఘవపుడి దృష్టి పడింది. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas,) తో ఫౌజి సినిమాలో ఛాన్స్ అందుకుంది ఇమాన్వి. సినిమా ఓపెనింగ్ రోజే ప్రభాస్ తో పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకుంది అమ్మడు.
ఐతే ఈ సినిమా ఓపెనింగ్ అవ్వడమే ఆలస్యం ఇమాన్వికి చాలా ఆఫర్లు వచ్చాయట. అందులో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఫౌజి సినిమా కోసం ప్రభాస్ తనకు వీలైనప్పుడు డేట్స్ ఇస్తాడు కాబట్టి హీరోయిన్ ఇమాన్వి (Imanvi)ని ఏడాది పాటు అందుబాటులో ఉండేలా ఆమెతో నిర్మాతలు డీల్ సెట్ చేసుకున్నారట. అందుకే అమ్మడు ఈలోగా ఎన్ని ఆఫర్లు వచ్చినా చేయనని చెబుతుంది.
యూఎస్ లో ఉంటున్న ఇమాన్వి..
ప్రస్తుతం యూఎస్ లో ఉంటున్న ఇమాన్వికి షూటింగ్ టైం లో కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఫౌజీ (Fauji) షూటింగ్ తమిళనాడులో జరుగుతుంది. ఈ సినిమా సెట్స్ లో ప్రభాస్ జనవరిలో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. తొలి సినిమానే ప్రభాస్ తో ఛాన్స్ అంటే ఇమాన్వి ఎంత లక్కో అర్ధం చేసుకోవచ్చు. ఫౌజీ రిలీజ్ ముందే అమ్మడు కచ్చితంగా ఐదారు సినిమాలు సైన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
సోషల్ మీడియాలో తన డ్యాన్స్ అండ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఇమాన్వి ఫౌజీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుందని అనడంలో సందేహం లేదు.
Also Read : ISRO : ఇస్రో శుక్రయాన్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం