Sreeleela : శ్రీలీలకు బోల్డ్ డార్క్ రోల్ ఆఫర్.. ఆ సినిమా సీక్వెల్ చేస్తుందా?
మెడిసిన్ ఎగ్జామ్స్ అని శ్రీలీల కొన్ని రోజుల క్రితం చిన్న గ్యాప్ తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఫామ్ లోకి వస్తుంది.
- By News Desk Published Date - 10:09 AM, Wed - 26 March 25

Sreeleela : శ్రీలీల కన్నడ నుంచి వచ్చిన తెలుగు అమ్మాయి. ఎంట్రీ పెళ్లి సందD తో అదరగొట్టి వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. సినిమాలు, యాడ్స్, టీవీ షోలు, ప్రమోషన్స్ చిన్న వయసులోనే ఫుల్ బిజీ అయిపొయింది. మొదట్లో హిట్స్ కొట్టినా ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ కూడా చూసింది.
మెడిసిన్ ఎగ్జామ్స్ అని శ్రీలీల కొన్ని రోజుల క్రితం చిన్న గ్యాప్ తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఫామ్ లోకి వస్తుంది. రాబిన్ హుడ్ సినిమాతో మార్చ్ 28న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అటు తమిళ్, ఇటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రీలీల. చేతిలో ఓ నాలుగైదు సినిమాలు ఉన్నాయి శ్రీలీలకు. అయితే శ్రీలీలకు ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఆఫర్ వచ్చిందట.
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ గా తెరకెక్కిన మంగళవారం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ బోల్డ్ క్యారెక్టర్ చేసి అందర్నీ మెప్పించింది. మంగళవారం సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. మొదటి పార్ట్ లో పాయల్ చనిపోతుంది కాబట్టి సీక్వెల్ లో ఇంకో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.
ఈ క్రమంలో శ్రీలీలకు అజయ్ భూపతి కథ వినిపించాడట. ఇందులో కూడా డార్క్ బోల్డ్ క్యారెక్టర్ ఉందట. అయితే శ్రీలీల ఇంకా ఏమి క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ కి ఒప్పుకుంటుందా చూడాలి. ఒకవేళ ఓకే అంటే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడినట్టే.
Also Read : NTR Wife : భార్య పుట్టినరోజు.. జపాన్ లో సెలబ్రేషన్స్.. అమ్మలూ అంటూ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన ఎన్టీఆర్..