Bhagavanth Kesari : మరో మాస్ సాంగ్ కు సిద్దమైన శ్రీలీల
శ్రీలీల నుండి ఓ మాస్ సాంగ్ వినబోతున్నారు
- Author : Sudheer
Date : 31-07-2023 - 8:10 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీలీల ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..త్వరలో శ్రీలీల నుండి ఓ మాస్ సాంగ్ వినబోతున్నారు. ఆ మాస్ సాంగ్ మాములుగా ఉండదట. పల్సర్ బైక్ సాంగ్ ను మించి ఉండబోతున్నట్లు సమాచారం. ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీలీల …ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. ఒకటి రెండు కాదు దాదాపు అరడజను సినిమాలు..అవి కూడా అగ్ర హీరోల సినిమాలే కావడం విశేషం. ఆ సినిమాలలో ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) ఒకటి.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా..బాలకృష్ణ కు చెల్లెలి క్యారెక్టర్ లో శ్రీలీల నటిస్తుంది. ముందుగా అనుకున్న కథ ప్రకారం శ్రీలీల కు తక్కువ నిడివే రాసుకున్నారట. కానీ ధమాకా (Dhamaka) తర్వాత అమ్మడి రేంజ్ పెరగడం..ఆమె డాన్సులు చూసాక డైరెక్టర్ అనిల్ రావిపూడి..ఆమె పాత్రను ఇంకాస్త పెంచడమే కాదు ఓ మాస్ సాంగ్ ను కూడా జత చేశారట. ఈ మాస్ సాంగ్ మాములుగా ఉండదని చిత్ర యూనిట్ అంటున్నారు. ధమాకా లో పల్సర్ బైక్ ను మించి ఉంటుందని చెపుతున్నారు. ఈ సాంగ్ లో శ్రీలీల (Sreeleela) తో పాటు బాలకృష్ణ , కాజల్ కూడా కనిపించనున్నారు. మరి ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ప్రస్తుతం సాంగ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్ లో జరుగుతుంది. ఈ సాంగ్ కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అతి త్వరలో షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టనున్నారట మేకర్స్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Read Also : Dil Raju : తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు.. మొదటి రోజే మీటింగ్..