Sreeleela: ఆ సంఘటన నా మనసును మార్చేసింది, అందుకే డాక్టర్ కావాలని డిసైడ్ అయ్యా
భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీలీల తాజాగా మీడియాతో మాట్లాడారు. అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
- By Balu J Published Date - 04:55 PM, Fri - 13 October 23
Sreeleela: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరనే విషయంపై అందరూ మాట్లాడుకునే పేరు శ్రీలీల. తనదైన అందం, అభినయంతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. మొదటి సినిమా పెళ్లి సందడి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా శ్రీలీలకి మాత్రం యమా క్రేజీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ధమాకా’తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో డజనుకు పైగా తెలుగు సినిమాలున్నాయి. ఇందులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదల కానుంది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’. నటిగా ఇంత బిజీగా ఉన్న ఈ భామ త్వరలో డాక్టర్‌గా మారబోతోంది. ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే చదువులోనూ రాణిస్తోంది. అంతేకాదు డాక్టర్ కావాలనేది తన కల అని చెప్పింది. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీలీల తాజాగా మీడియాతో మాట్లాడారు. అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లలేదు
సాధారణంగా నేను భరతనాట్యం మాత్రమే చేసేదాన్ని. నటనపై కూడా అవగాహన లేదు. భరత నాట్యం చేస్తున్నప్పుడు నా డ్యాన్స్‌తో కథ చెప్పాలి. డైలాగులు లేకుండా కథ చెప్పడం చాలా కష్టం. భరతనాట్యంలో అనుభవం ఉండడం వల్ల నాకు నటన కష్టంగా అనిపించలేదు. నేను ఏ యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లలేదు. రాఘవేంద్రరావు దయ వల్ల ‘పెళ్లి సందడి’లో అవకాశం వచ్చింది..ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిమానంతో మరింత దగ్గరవ్వడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. నటిగా ఎంత బిజీగా ఉన్నా చదువును మాత్రం వదులుకోను. డాక్టర్ కావాలన్నది నా లక్ష్యం.
ఆ సంఘటన నా మనసు మార్చేసింది
నేను డాక్టర్ కావాలనే నిర్ణయం వెనుక ఓ కథ ఉంది. మా కుటుంబంలో అమ్మతో పాటు అన్నయ్య కూడా డాక్టర్. ఒకసారి నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను. అది మారుమూల గ్రామం. ఒకరోజు అమ్మమ్మ హఠాత్తుగా కిందపడిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. నేను అందరితో పాటు అక్కడే నిలబడి ఉన్నాను. అయితే అన్నయ్య వెంటనే వచ్చి అమ్మమ్మను లేపి వైద్యం చేశాడు. దీంతో అమ్మమ్మ ప్రమాదం నుంచి బయటపడింది.
ఎప్పటికైనా డాక్టర్నే
అన్నయ్య మెడిసిన్ చదువుతున్నాడు కాబట్టి ఆ సమయంలో చేయాల్సిన పని చేశాడు. కానీ నాకు సహాయం చేయాలని అనిపిస్తుంది కానీ ఎలా చేయాలో తెలియదు. ఆ రోజు ఫిక్సయిపోయా. ఎప్పటికైనా డాక్టర్నే కావాలని. అందుకే మెడిసిన్ కోర్సు తీసుకున్నాను. షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ పరీక్షలు ఉన్నప్పుడే రాత్రిపూట చదువుకుంటాను. ఇప్పటికీ నేను సినిమా ఒప్పుకుంటే.. దాని ప్రభావం నా చదువుపై పడుతుందని నాకు తెలుసు. అయితే ఇప్పుడు మంచి పాత్రలు వస్తున్నాయి. అందుకే కొంచెం కష్టమని ఒప్పుకున్నాను. రాత్రి చదువుతున్నాను’ అంది శ్రీలీల.
Related News
Varalaxmi Sarathkumar: లైఫే రిస్క్.. హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు
Varalaxmi Sarathkumar: వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషా�