Sreeleela : బాలీవుడ్లో సూపర్ ఛాన్స్ కొట్టేసిన ధమాకా బ్యూటీ..?
Sreeleela : టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని
- By Sudheer Published Date - 12:52 PM, Wed - 12 February 25

యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela ) ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ గా ఉంది. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. ఇక తాజాగా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్(Bollywood)లోకి ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల శ్రీలీల బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఆఫీస్ వద్ద కనిపించిందని, అక్కడ స్టార్ కిడ్ ఇబ్రహీం అలీఖాన్‌తో కలిసి ఉండటంతో ఆమె హిందీ సినిమాలో నటించనున్నారని బీటౌన్‌లో బలమైన ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమేనని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ ఎంట్రీ కోసం శ్రీలీల చర్చలు జరుపుతున్న సంగతి మాత్రం నిజమే అని సినీ వర్గాలు చెబుతున్నాయి.
CM Phone Call : చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఒక ఫోన్ కాల్.. అసలేం జరిగింది ?
టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని, అందులో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, శ్రీలీల అభిమానులు మాత్రం ఈ వార్తను సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. తెలుగు ప్రస్తుతం ఈమె నితిన్‌తో ‘రాబిన్ హుడ్’, పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు చేస్తుంది. కోలీవుడ్‌లో ‘పరాశక్తి’ ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది.