Viswak Sen : లైలాలో విశ్వక్ లేడీ వాయిస్ ఎవరిది..?
Viswak Sen లైలా రోల్ కి విశ్వక్ సేన్ కి శ్రావణ భార్గవి వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే లైలా సినిమాలో విశ్వక్ సేన్ మాట్లాడే మాటలు అన్నీ శ్రావణ భార్గవి గొంతు
- By Ramesh Published Date - 11:31 PM, Wed - 5 February 25

Viswak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ లైలా సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమా నిర్మించగా రాం నారాయణ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించగా సినిమాలో విశ్వక్ సేన్ కూడా లేడీ గెటప్ లో ఆడియన్స్ ని మెప్పించబోతున్నాడు.
ఐతే ఈ సినిమాలో సోను మోడల్ గా ఒక రోల్.. లైలా పాత్రలో విశ్వక్ రెండు పాత్రలను బ్యాలెన్స్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో లైలా రోల్ కి విశ్వక్ సేన్ కి శ్రావణ భార్గవి వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే లైలా సినిమాలో విశ్వక్ సేన్ మాట్లాడే మాటలు అన్నీ శ్రావణ భార్గవి గొంతు నుంచి వచ్చినవే అని చెప్పాలి.
లైలా సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ కోసం చాలా కష్టపడ్డాడు. గంటల కొద్దీ మేకప్ తో విశ్వక్ పడిన కష్టం లైలా మేకింగ్ వీడియోలో చూపించారు. సినిమా కోసం విశ్వక్ ఎంతో శ్రమపడ్డాడు. మరి అతని శ్రమకు తగిన ఫలితం ఉంటుందా లేదా అన్నది చూడాలి. విశ్వక్ సేన్ మాత్రం లైలా కచ్చితంగా ఆడియన్స్ కి మంచిట్రీట్ అందిస్తుందని అంటున్నాడు. విశ్వక్ కాన్ ఫిడెన్స్ చూస్తే సినిమా మాస్ కా దాస్ ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇచ్చేలా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.