Toxic : యశ్ ‘టాక్సిక్’ మూవీలో విలన్‌గా కనిపించబోతున్న స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?
యశ్ 'టాక్సిక్' మూవీలో విలన్‌గా కనిపించబోతున్న ఆ స్టార్ హీరో. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంతో తెరకెక్కుతున్న..
- By News Desk Published Date - 07:09 PM, Tue - 9 July 24

Toxic : ‘కేజీఎఫ్’ సిరీస్ తో పాన్ ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసిన కన్నడ హీరో యశ్.. ఆ తరువాత ఇప్పటివరకు మరో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాలేదు. కేజీఎఫ్ 2 రిలీజైన ఏడాది తరువాత టాక్సిక్ అనే సినిమాని అనౌన్స్ చేసారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన గీతూ మోహన్ దాస్ దర్శకురాలిగా రెండు సినిమాలు మాత్రమే చేసారు. ఇక ఇప్పుడు కేజీఎఫ్ వంటి సక్సెస్ తో ఉన్న యశ్ తో భారీ ప్రాజెక్ట్ చేసే భాద్యతని తీసుకున్నారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కాస్టింగ్ గురించిన వివరాలు ఇప్పటివరకు రాలేదు. కానీ ఫిలిం వర్గాల్లో మాత్రం కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఏంటంటే హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుందని, ఇక మరో ముఖ్య పాత్రలో కాజోల్ లేదా నయనతార కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ వార్తలు ఇలా ఉంటే.. తాజాగా మూవీలో విలన్ గా కనిపించబోయే నటుడి వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో యశ్ కి విలన్ గా ఓ మలయాళ స్టార్ హీరో కనిపించబోతున్నారట. 2018 సినిమాతో సౌత్ టు నార్త్ మంచి ఫేమ్ ని సంబంధించిన టోవినో థామస్.. టాక్సిక్ లో విలన్ గా చేయబోతున్నారట.
ఈ సినిమా కథ ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంతో సాగుతుందట. కేజీఎఫ్ సినిమా మాదిరి ఈ మూవీలో కూడా యశ్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట. ఇక ఆ పాత్రకి పోటీగా ఢీ అంటే ఢీ అనే పాత్రలో టోవినో థామస్ కనిపించబోతున్నారని టాక్. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ రావాల్సిందే. కాగా ఈ మూవీని 2025 సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.