HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sobhita Dhulipala Talked About Being A Woman In India I Feel Women Are Living By Patriarchal Rules

ఇకనైన స్టిరీయోటైప్ ఆలోచనలకు బ్రేక్ వేయండి!

మిస్ ఇండియా అందాల పోటీల్లో జయకేతనం ఎగురవేసి మోడలింగ్ లో రాణించి.. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది అచ్చ తెలుగు అందం శోభిత ధూళిపాళ్ల. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న శోభిత గూఢచారి సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయమైంది.

  • By Balu J Published Date - 01:15 PM, Thu - 14 October 21
  • daily-hunt

మిస్ ఇండియా అందాల పోటీల్లో జయకేతనం ఎగురవేసి మోడలింగ్ లో రాణించి.. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది అచ్చ తెలుగు అందం శోభిత ధూళిపాళ్ల. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న శోభిత గూఢచారి సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయమైంది. అనురాగ్ కాశ్యప్ డైరెక్షన్ లో వచ్చిన ‘రమణ్ రాఘవ్‘ ఆమె హీరోయిన్ గా నటించింది. ఇందులో తన నటన నచ్చడంతో అడవి శేష్ తనను కలిసి ‘గూఢచారి’ సినిమా ఆఫర్ చేశాడంటూ చెప్పుకొచ్చింది. ఇందులో హార్వర్డ్ నుంచి వచ్చిన సైకాలజిస్ట్ పాత్రలో ఆమె కనిపిస్తుంది. కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్ నచ్చడంతో సొంత భాష తెలుగులో అడుగుపెట్టడానికి ఇదే కరెక్ట్ మూవీ అని భావించి గూఢచారి ప్రాజెక్టుకు ఓకే చెప్పానని శోభిత తెలిపింది. శోభిత ఇప్పటికే బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ హీరోగా నటించిన బ్లాక్ కామెడీ ‘కాలాకండీ’లోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మితో ఓ సినిమా పూర్తి చేసింది. దీంతోపాటు మళయాళ నటుడు నివిన్ పౌలీతో మూతోన్ సినిమా చేస్తోంది. ఇలా ఇటు నార్త్, ఇటు సౌత్ సినిమాలతో తెగ బిజీగా ఉన్నానంటోందీ తెలుగు సుందరి.

బాలీవుడ్ మంచి పేరు తెచ్చుకున్న శోభిత ఏ విషయమైనా సరే కుండబద్ధలు కొట్టేలా మాట్లాడుతుంది.  తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పడానికి ఏమాత్రం వెనుకాడదు. ఈ నెల అక్టోబర్ లో  ‘కాస్మోపాలిటన్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీపై శోభిత ఫొటో పబ్లిష్ అయ్యింది. ఈ సందర్భంగా మీడియాతో తన ఆలోచనలను పంచుకున్నారు. మనదేశంలో నేటికీ మహిళలు పితృస్వామ్య నియమాల ప్రకారం జీవిస్తున్నారని, అన్నిరంగాలలో రాణిస్తున్నా ఈ మూస పద్ధతుల నుంచి బయటకు రావడం లేదని అన్నారు. తాను చాలామంది మహిళలను కలుసుకున్నానని, ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రుల నిర్దేశించిన లక్ష్యాల మేరకే పనిచేస్తున్నట్లు తెలుసుకున్నానని స్పష్టం చేసింది. పితృస్వామ్య నియమాల ప్రకారం పనిచేయడం వల్ల మహిళలు తమను తాము తెలుసుకోలేరని, లక్ష్యాలు, ఆశయాలకు అడ్డుగా మారుతాయని తెలిపింది. ఇప్పటికీ మూసధోరణి పద్ధతులను పాటిస్తుండటం వల్ల ఆయా రంగాల్లో రాణించలేకపోతున్నారని తెలిపింది. ఇకనైన మహిళలు ఇలాంటి నియామాలకు స్వస్తి పలకాలని సూచించింది.

‘మేడ్ ఇన్ హెవెన్’ సీజన్-2 లో శోభిత ధూళిపాళ నటించనుంది. ప్రస్తుతం శోభిత వందన కటారియా, మలయాళ చిత్రం కురుప్‌ ల్లో నటించనుంది. అడివి శేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మేజర్ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాదు.. హాలీవుడ్ ప్రాజెక్టును కూడా సొంతం చేసుకుంది. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్‌’లో నటించనుంది శోభిత.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • feels
  • shobitha
  • talks on issue
  • telugu girl

Related News

Dharmendra Pension

Dharmendra Pension: ధర్మేంద్ర మృతి.. ఆయ‌న‌ పెన్షన్ ఎవరికి దక్కుతుంది?

ధర్మేంద్ర కుటుంబం గురించి ప్రజలు ఎప్పుడూ రెండు వర్గాలుగా ప్రకాశ్ కౌర్, హేమా మాలిని చర్చించుకుంటారు. సామాజికంగా ఇద్దరు భార్యలు అందరికీ తెలిసినవారే అయినప్పటికీ చట్టం దృష్టిలో ధర్మేంద్ర మొదటి భార్య మాత్రమే చట్టబద్ధమైన జీవిత భాగస్వామిగా పరిగణించబడుతుంది.

  • Dharmendra Death Cause

    Dharmendra: ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌!

Latest News

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్థానం ఇదే.. క్రికెటర్ నుండి ప్రధానిగా, ఆపై జైలుకు ఎలా చేరారు?

  • Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

  • Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

  • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

  • Rear View Mirror: బైక్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా సెట్ చేయాలి?

Trending News

    • Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

    • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

    • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd