N Convention Demolition : శోభిత ఐరెన్ లెగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
అక్కినేని అభిమానులు మాత్రం శోభిత అడుగుపెట్టిన వేళా విశేషం అంటూ కామెంట్స్ వేస్తున్నారు
- By Sudheer Published Date - 02:25 PM, Sat - 24 August 24

హైదరాబాద్ (Hyderabad) లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA ) ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తుండడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా ఇలానే దూకుడుగా ముందుకెళ్లి పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆయా నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఇలానే ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి చెందిన స్థలాలు, చెరువులను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ఉదయం నాగార్జున (Nagarjuna) కు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ (N-Convention Centre) ను హైడ్రా అధికారులు నేలమట్టం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
నాగార్జున, నల్ల ప్రీతమ్ రెడ్డి కలిసి సంయుక్తంగా హైదరాబాద్ మాదాపూర్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో N-కన్వెన్షన్ సెంటర్ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండగా.. 1.12 ఎకరాలు FTL పరిధిలో, 2 ఎకరాల బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎప్పటి నుంచో వివాదంలో ఉంది. మాదాపూర్లోని చెరువును ఆక్రమించి దీన్ని నిర్మించారన్నది ఆరోపణ. 2014లో కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసి FTLలో నిర్మించారని తేల్చారు. మిగతా నిర్మాణాలను కూల్చిన అధికారులు.. ఈ కన్వెన్షన్ సెంటర్ జోలికి వెళ్ళలేదు. కానీ ఈరోజు రేవంత్ సర్కార్ ‘N ‘ కన్వెన్షన్ నేలమట్టం చేసి..చట్టం ముందు అందరు సమానులే అని చెప్పకనే చెప్పారు.
అక్కినేని అభిమానులు మాత్రం శోభిత అడుగుపెట్టిన వేళా విశేషం అంటూ కామెంట్స్ వేస్తున్నారు. ఇటీవలే నాగ చైతన్య – శోభిత ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. వీరిద్దరికీ నిశ్చితార్థం చేశామని అధికారికంగా ప్రకటించారు. నాగచైతన్యకు శోభిత వల్ల కలిసొస్తుందని, అన్నీ ప్లాన్ చేసి డేట్ ను , టైమ్ ను సైతం ఫిక్స్ చేసి వీరిద్దరికి అనుకూలమైన గ్రహాల ప్రకారమే ఎంగేజ్మెంట్ చేశాము.. పెళ్లి తేదీ విషయం పైన కూడా ఇంతే పగడ్బందీగా ప్లాన్ ప్రకారమే అనుకూలమైన తేదీలని చూసేలా ప్లాన్ చేస్తున్నాము అంటూ తెలిపారు. కానీ ఇప్పుడు తాజా పరిస్థితిని చూస్తే.. అక్కినేని కుటుంబానికి శోభిత దురదృష్టంగా మారింది అని అంటున్నారు. నిశ్చితార్థం జరిగి నెల కూడా కాలేదు అప్పుడే అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ (N – Convention) హాల్ కూల్చివేత అక్కినేని కుటుంబ సభ్యులను టెన్షన్ పెడుతుంది. అక్కినేని ఇంటికి కోడలిగా శోభిత ఇంకా పూర్తిగా అడుగు పెట్టనే లేదు. అప్పుడే ఈ కుటుంబం చిక్కుల్లో పడిందని ..ముందు ముందు ఇంకెన్ని అనర్దాలు జరుగుతాయో అని అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : KTR : నా వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: కేటీఆర్