Siva Kartikeyan Ayalaan : డైరెక్ట్ ఓటీటీలో స్టార్ హీరో సినిమా.. తెలుగు రిలీజ్ అవ్వకుండానే డిజిటల్ స్ట్రీమింగ్..!
Siva Kartikeyan Ayalaan కోలీవుడ్ స్టార్ హీరో వీడియో జాకీ నుంచి హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్ తను నటించిన ప్రతి సినిమాతో తమిళ ఆడియన్స్ ని అలరిస్తూ
- Author : Ramesh
Date : 05-02-2024 - 7:06 IST
Published By : Hashtagu Telugu Desk
Siva Kartikeyan Ayalaan కోలీవుడ్ స్టార్ హీరో వీడియో జాకీ నుంచి హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్ తను నటించిన ప్రతి సినిమాతో తమిళ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. కెరీర్ మొదట్లో లో బడ్జెట్ సినిమాలతో హిట్లు కొట్టిన శివ కార్తికేయన్ కాస్త క్రేజ్ రాగానే ప్రయోగాలు చేస్తూ బడ్జెట్ రేంజ్ కూడా పెంచుకుంటూ వచ్చాడు. రీసెంట్ గా అయలాన్ సినిమాతో తమిళంలో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు శివ కార్తికేయన్.
We’re now on WhatsApp : Click to Join
శివ కార్తికేయన్ సినిమాలు తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తెలుగులో కూడా అతని సినిమాలు మంచి రెవిన్యూ తెచ్చుకుంటున్నాయి. లాస్ట్ ఇయర్ మహావీరుడుతో వచ్చిన శివ కార్తికేయన్ లేటెస్ట్ గా అయలాన్ ని కూడా తెలుగులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజైన అయలాన్ ని జనవరి 26న తెలుగులో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తెలుగు వెర్షన్ రిలీజ్ రోజు ఆట పడలేదు. ఏవో ఆర్ధిక పరమైన ఇబ్బందుల వల్ల సినిమాను తెలుగు వెర్షన్ రిలీజ్ కాకుండా ఆపేశారు. అయితే పది రోజులు అవుతున్నా కూడా ఆ సమస్య తీరలేదు.
అందుకే శివ కార్తికేయన్ అయలాన్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకోగా సినిమాను ఫిబ్రవరి 16న ఓటీటీ రిలీజ్ లాక్ చేశారు. దాదాపు తెలుగు వెర్షన్ కూడ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంటుంది. శివ కార్తికేయన్ సినిమా తెలుగులో ఠియేట్రికల్ రిలీజ్ కాకుండానే ఓటీటీ రిలీజ్ అవుతుంది. అయలాన్ థియేట్రికల్ రిలీజ్ అవుతుందని శివ కార్తికేయన్ హైదరాబాద్ వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశాడు. కానీ సినిమా రిలీజ్ మాత్రం కాలేదు.
Also Read : Kumari Aunty : నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా కుమారి ఆంటీ స్టోరీ..!