Sitara Birthday: పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థినులకు సైకిళ్ళ పంపిణి
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ గారాలపట్టి సితార ఘట్టమనేని జూలై 20న 11వ ఏట అడుగుపెట్టింది. సితార తన పుట్టిన రోజు పురస్కరించుకుని నిరుపేద విద్యార్థినులకు సైకిళ్లను అందించింది.
- By Praveen Aluthuru Published Date - 01:34 PM, Thu - 20 July 23

Sitara Birthday: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ గారాలపట్టి సితార ఘట్టమనేని జూలై 20న 11వ ఏట అడుగుపెట్టింది. సితార తన పుట్టిన రోజు పురస్కరించుకుని నిరుపేద విద్యార్థినులకు సైకిళ్లను అందించింది. నిరుపేద విద్యార్థినుల సమక్షంలో కేక్ కట్ చేసి పింక్ కలర్ సైకిళ్లను బహుకరించింది. దీంతో ఆ విద్యార్థుల ఎంతో సంతోషించారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో గొప్పగొప్ప కార్యక్రమాలు చేస్తున్న ఘట్టమనేని ఫ్యామిలీ సితార పుట్టినరోజు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా విద్యార్థినులకు సైకిళ్లను అందించారు. ఇక ఇప్పటికే ఆమె కోటి రూపాయలు స్వచ్చంద సంస్థకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ యాడ్ లో వచ్చిన మొత్తాన్ని సితార స్వచ్చంద సంస్థకు ఇస్తున్నట్లు ప్రకటించింది.
సితార పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు. పలువురు సెలెబ్రిటీలు సీతారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఘట్టమనేని అభిమానులు సితార పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుతున్నారు.
Read More: Trolls On ‘Project K’: ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’పై ట్రోల్స్.. మరో ఆదిపురుష్ అంటూ కామెంట్స్!