Bigg Boss 6: శ్రీహాన్ పేరు టాటూ వేయించుకున్న సిరి.. హగ్గులు కిస్సులతో రెచ్చిపోయిన శ్రీహాన్, సిరి?
- By Nakshatra Published Date - 02:29 PM, Thu - 24 November 22

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6, 12 వ వారం కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ ఇస్తున్నారు. కాగా ఇప్పటికే ఆదిరెడ్డి భార్య కవిత కూతురు అద్వైత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పైమా మదర్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీ సత్య తల్లిదండ్రులు ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీహాన్ ప్రేయసి అయిన సిరి హనుమంత్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీహాన్ ఫ్రీజ్‌లో ఉండగా సిరి వస్తుంది.
రాగానే శ్రీహాన్‌ని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఇక శ్రీహాన్ ఫ్రీజ్ లో ఉండడంతో సిరి ముద్దుల మీద ముద్దులు పెడుతూ శ్రీహాన్ ని ఒక ఆట ఆడుకుంది. ఆ తర్వాత శ్రీ హాన్ రిలీజ్ చేయడంతో ఆమెను హగ్ చేసుకుని ముద్దులు పెట్టాడు. ఆ తర్వాత సిరి బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ముచ్చటిస్తూ అందరితో కలిసి సరదాగా మాట్లాడింది. ఆ తర్వాత శ్రీ సత్య, ఇనయాలపై కౌంటర్లు వేసింది సిరి. సిరి,ఇనయాకి కౌంటర్ వేస్తూ ఏంటి ఈ మధ్య మావాడి పై కాన్సన్ ట్రేట్ చేయడం లేదు అంటూ నవ్వుతూ ప్రశ్నిస్తుంది. శ్రీహాన్‌ని ఏడిపిస్తూ ఉంటాం.. ఏమనుకోకు అంటూ శ్రీసత్య చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత శ్రీహాన్ కళ్ళు మూసుకోమని చెప్పి నీకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తాను అనే సిరి వెనుక వైపు తిరిగి తన మెడపై శ్రీహాన్ పేరుని టాటూ వేయించుకున్నది చూపించడంతో శ్రీహాన్ నోట మాట రాలేదు. అలా కాసేపు సిరిని హగ్ చేసుకుని ఉండిపోయాడు. ఆ తర్వాత శ్రీహాన్ కొడుకు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ మరింత సందడి సందడిగా మారింది. హౌస్ మొత్తం తిరుగుతూ అందరినీ ఆటపట్టిస్తూ హౌస్ లో ఎవరెవరు ఎలా మాట్లాడతారు ఎలా ఆడతారు అన్నది ఇమిటేట్ చేస్తూ అందరిని నవ్వించాడు.
Related News

Bigg Boss 7 : నలుగురు అమ్మాయిలే ఎలిమినేట్.. ఏం జరుగుతుంది..?
బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7 ) నుంచి ఆదివారం రతిక ఎలిమినేషన్ అందరికీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్