Singer Pravasthi : ప్రవస్తి వివాదంపై సింగర్ లిప్సిక రియాక్షన్
Singer Pravasthi : ఏ ఒక్క స్టోరీకైనా రెండు పక్షాలుంటాయని, ఒకవైపు కథ విని ఎవరినైనా జడ్జ్ చేయడం తగదని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో ప్రవస్తి ప్రమేయం లేకుండానే అనేక తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో వీడియోలు వైరల్ అవుతున్నాయన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
- By Sudheer Published Date - 08:36 PM, Tue - 22 April 25

టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రవస్తి ( Singer Pravasthi) వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సింగర్ లిప్సిక (Singer Lipsika) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వీడియో ద్వారా స్పందించారు. ప్రవస్తి పాడుతా తీయగా కార్యక్రమంలో తన అనుభవాన్ని పంచుకున్నారని లిప్సిక చెప్పారు. ఏ ఒక్క స్టోరీకైనా రెండు పక్షాలుంటాయని, ఒకవైపు కథ విని ఎవరినైనా జడ్జ్ చేయడం తగదని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో ప్రవస్తి ప్రమేయం లేకుండానే అనేక తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో వీడియోలు వైరల్ అవుతున్నాయన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
GVMC Mayor Election : 28న జీవీఎంసీ మేయర్ పదవికి ఎన్నిక.. నూతన మేయర్ ఎవరంటే?
ఇండస్ట్రీ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలంటే అనుభవం అవసరమని లిప్సిక తెలిపారు. కెరీర్ ప్రారంభంలో ఎలాంటి కష్టాలు లేకుండా పైకి వచ్చిన వారు చాలా తక్కువమంది ఉంటారన్నది ఆమె వ్యాఖ్య. ప్రతి సింగర్, మ్యూజిషియన్ విజయం వెనక ఎంతో పోరాటం ఉంటుందని పేర్కొన్నారు. రియాలిటీ షోలకు వెళ్లాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం కాగా, ఫేవరెటిజం అంశాన్ని ప్రస్తావిస్తూ , ఎవరికైనా అవకాశం వస్తే తాము పరిచయమున్న వారినే సూచించడం సహజమని చెప్పారు. మనుషులుగా పరిచయం, అనుభవం, సాన్నిహిత్యం ఉండటం వల్ల అలాంటివి జరుగుతాయని ఆమె వివరించారు.
లిప్సిక తన కెరీర్ అనుభవాన్ని పంచుకుంటూ 2017–2018లో కీరవాణి (Keeravani) గారిని కలిసినప్పుడు తాను బెస్ట్ ఇవ్వలేదని, ఆ కారణంగా ఆరు సంవత్సరాల పాటు అవకాశాలు రాకపోయాయని తెలిపారు. ఆరేళ్ల తర్వాతే మళ్లీ అవకాశం వచ్చినప్పటికీ, కీరవాణి గారు ఎప్పుడూ హంబుల్‌గా ఉంటారని, అందరినీ సమానంగా చూసే గుణం కలవారని కొనియాడారు. కీరవాణి గారు నిజమైన లెజెండ్ అని ఆమె ప్రశంసించారు. లిప్సిక చేసిన ఈ కామెంట్లు టాలీవుడ్‌లో చర్చగా మారుతున్నాయి.
Gnapika entertainment producer praveena kadiyala about singer #Pravasthi issue.#ETV #paduthatheeyaga pic.twitter.com/OlhBtBiaNe
— Vamsi Kaka (@vamsikaka) April 22, 2025