Siddhu Jonnalagadda : సిద్ధు జాక్ వెనక ఇంత స్టోరీ ఉందా..?
Siddhu Jonnalagadda డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకుని రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో అదే రేంజ్ సక్సెస్ అందుకున్నాడు స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ తో సిద్ధు రేంజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.
- Author : Ramesh
Date : 01-04-2024 - 3:03 IST
Published By : Hashtagu Telugu Desk
Siddhu Jonnalagadda డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకుని రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో అదే రేంజ్ సక్సెస్ అందుకున్నాడు స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ తో సిద్ధు రేంజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. సినిమా స్టార్ రేంజ్ కు తగినట్టుగా వసూళ్లు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ జాక్, తెలుసు కదా సినిమాలు చేస్తున్నాడు. జాక్ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తుంది.
బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ధు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. జాక్ సినిమా అసలైతే బొమ్మరిల్లు భాస్కర్ కోలీవుడ్ హీరో ధనుష్ తో చేయాలని అనుకున్నాడట. ధనుష్ కి కూడా కథ నచ్చిందట కానీ ఎందుకో అది వర్క్ అవుట్ అవ్వలేదు.
ఈలోగా బోగవల్లి ప్రసాద్ సిద్ధుతో ఈ సినిమా లాక్ చేశారు. బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. సిద్ధు జాక్ సినిమా ధనుష్ చేయాల్సిందని అది కాస్త సిద్ధు చేతికి వచ్చిందని అంటున్నారు. మరి ధనుష్ కథతో సిద్ధు చేస్తున్న ఈ జాక్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : Nani 33 : నాని 33 కథ అదేనా.. దసరాని మించే ప్లానింగ్ ఫిక్స్..!