Siddharth Roy : అర్జున్ రెడ్డి కాదు అంతకుమించి.. సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ టాక్..!
Siddharth Roy అతడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన దీపజ్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారి చేస్తున్న సినిమా సిద్ధార్థ్ రాయ్. ఈ సినిమాను నూతన దర్శకుడు యశస్వి డైరెక్ట్
- By Ramesh Published Date - 05:23 PM, Tue - 23 January 24

Siddharth Roy అతడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన దీపజ్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారి చేస్తున్న సినిమా సిద్ధార్థ్ రాయ్. ఈ సినిమాను నూతన దర్శకుడు యశస్వి డైరెక్ట్ చేశారు. సినిమాలో తన్వి నేగి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాను శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్ లో జయ అడపాక, ప్రదీప్ పూడ్, సుధాకర్ బోయిన కలిసి నిర్మిస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఈ సినిమా ట్రైలర్ చూస్తే తెలివైన హీరో కేవలం మూడు అంశాల మీద దృష్టి పెడతాడు. అది శృంగారం, నిద్ర, తిండు. వీటితోనే జీవితం సాగిస్తుంటాడు. కానీ అతని లైఫ్ లోకి ఇందు అనే అమ్మాయి వస్తుంది తనకు ప్రేమని పరిచయం చేస్తుంది. కానీ సిద్ధార్థ్ మేధావి కాబట్టి మళ్లీ ఇబ్బందుల్లో పడతాడు. అతను తన కష్టాల నుంచి ఎలా బయట పడ్డాడు అన్నది సినిమా కథ.
Also Read : 2023 Indian Boxoffice Collections : 12వేల కోట్లు.. 2023 ఇండియన్ సినిమా రెవిన్యూ లెక్క ఇదే..!
సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ చూస్తే ఈ సినిమా అర్జున్ రెడ్డికి కాస్త అటు ఇటుగానే ఇంకా చెప్పాలంటే దానికి మించి అనిపించేలా ఉంది. హీరో క్యారెక్టరైజేషన్ మీదే సినిమా నడిపిస్తారని అర్ధమవుతుంది. సినిమా ట్రైలర్ లో యూత్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. సో యూత్ ఆడియన్స్ ఈ సినిమాను తప్పకుండా చూసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ యూత్ ని ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.