Shyamala Devi : వేణు స్వామి ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణం రాజు భార్య
- Author : Sudheer
Date : 20-01-2024 - 8:03 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ మధ్య జ్యోతిష్యుడు వేణు స్వామి (Astrologer Venuswami) పేరు వైరల్ గా మారింది..సినీ ప్రముఖుల తాలూకా జ్యోతిష్యం (Astrology ) చెపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. వేణు స్వామి చెప్పిన జాతకాలలో కొన్ని నిజం కాగా చాలావరకు అబద్దం అయ్యాయి. అయినప్పటికీ ఎప్పటికి ఈయన పేరు వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా చిత్రసీమ (Film Industry )కు సంబదించిన నటి నటులతో పరిచయాలు..వారిచేత పూజలు చేయించడం..వారి జాతకాలను తెలియజేస్తుండడం తో సినీ లవర్స్ ఎక్కువగా ఈయన్ను ఫాలో అవుతూ..ఈయన చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఇటీవల ఈయన ప్రభాస్ (Prabhas) పెళ్లి (Prabhas Wedding) ఫై , అలాగే ఆయన ఆరోగ్యం (Prabhas Health) ఫై చేసిన కామెంట్స్ పట్ల అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా…తాజాగా కృష్ణం రాజు భార్య , ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి (Shyamala Devi) ఘాటుగా స్పందించారు.
We’re now on WhatsApp. Click to Join.
కృష్ణం రాజు మరణానంతరం పెద్దగా బయట కనిపించని ఆమె తాజాగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో కృష్ణం రాజు గారి మీద తనకున్న ప్రేమను మరోసారి వెల్లడించారు. అలాగే ప్రభాస్ ఫై వేణు స్వామి చేస్తున్న కామెంట్స్ ఫై కూడా రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ జాతకం పై ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ప్రభాస్ జాతకం అతని తల్లి దగ్గర ఉంది ఇప్పటివరకు అది మేమే చూడలేదు. మరి ప్రభాస్ జాతకం అతని దగ్గరకు ఎలా వెళ్లింది అని అన్నారు. ప్రభాస్ ఆరోగ్య బాగోదని పెళ్లి విషయంపై అతను చేసే కామెంట్స్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. కృష్ణం రాజు గారు ఉన్నప్పుడు ఇలా ఎవరైనా తమ గురించి చెడుగా మాట్లాడితే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని వదిలేస్తారని. తాము కూడా అలానే ఈ విషయాలన్నీ పట్టించుకోమని అన్నారు. ప్రభాస్ మా అందరితో చాలా ఆప్యాయంగా ఉంటాడని తనకు చెల్లెల్లు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.
Read Also : Ayodya – Hanuman : నార్త్ లో ఓ పక్క అయోధ్య ..మరోపక్క హనుమాన్..రెండు రికార్డులే