Shruti Haasan – Shanthanu : శృతి హాసన్ – శంతను హజారిక విడిపోవడానికి కారణం అదేనా..?
ఆమెను పెళ్లి చేసుకునేందుకు శాంత ఒప్పుకోకపోవడమే అని పలు మీడియా లలో ప్రచారం అవుతుంది
- Author : Sudheer
Date : 30-04-2024 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్రసీమలో ప్రేమ పేరుతో దగ్గరవ్వడం..సహజీవనం..పెళ్లి..విడాకులు ఇవన్నీ కామన్. ఇప్పటివరకు ఎన్నో సినీ జంటలు ప్రేమతో దగ్గరవ్వడం..పిల్లలు పుట్టాక విడిపోవడం..కొంతమంది పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటు కాపురం చేసాక విడిపోవడం..ఇలా ఎన్నో జరిగాయి. తాజాగా శృతిహాసన్ – శంతను హజారిక ఇద్దరు విడిపోయారనే (Shruti Haasan – Santanu Breakup) వార్త కూడా గత పది రోజులుగా సోషల్ మీడియా లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతుంది. గతంలో ఫోటోగ్రాఫర్‌తో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ..కొంతకాలానికి అతడితో విడిపోయి..తర్వాత శంతనుతో ప్రేమలో పడింది. నాలుగైదేళ్లుగా వీరిద్దరి ఘాటైన ప్రేమలో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిత్యం శాంతనుతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను శృతిహాసన్ తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..అభిమానులను సంతోష పరుస్తూ వస్తుంది. ఈ ఫొటోస్ , వీడియోస్ చూసిన వారంతా ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతారని అంత అనుకుంటున్నా సమయంలో ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం ఆమెను పెళ్లి చేసుకునేందుకు శాంత ఒప్పుకోకపోవడమే అని పలు మీడియా లలో ప్రచారం అవుతుంది. ఎంతకాలం ఇలా ..పెళ్లి చేసుకొని ఒకటివుందాం అని రీసెంట్ గా శృతి..శాంత తో చెప్పిందట. కానీ శాంతన్ మాత్రం పెళ్ళికి నిరాకరించాడట. దీంతో శృతి అతడికి గుడ్ బై చెప్పిందని అంటున్నారు. ఇదంతా గత నెలలో జరిగిందని..అందుకే ఆమె శాంత తాలూకా ఏ జ్ఞాపకాలు ఉండకూడదని ఫొటోస్ , అతడి వివరాలను ఎక్కడ కనిపించకూడదని అంత డిలీట్ చేసిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ బ్రేకప్ గురించి ఇరువురు స్పందించకపోయిన ఇది నిజం అంటున్నారు. శృతి సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా సలార్ తో సూపర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్ షూటింగ్ లో శృతి బిజీ గా ఉంది.
Read Also : AP : మా భూముల పట్టాపుస్తకాలపై నీ ఫోటో ఎందుకు..? జగన్ కు పవన్ సూటి ప్రశ్న..