Chakri Death: చక్రి మరణం వెనుక షాకింగ్ నిజాలు.. ఆ విషయాలు బయటపెట్టిన తమ్ముడు మహతి?
ప్రముఖ సంగీత దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు చక్రి. తన పాటలతో ఎంతోమందిని ఫిదా చేశాడు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా తన సంగీతంతో బాగా ఫిదా చేశాడు. దాదాపు 85 సినిమాలకు తన సంగీతాన్ని అందించాడు.
- Author : Anshu
Date : 31-03-2023 - 10:25 IST
Published By : Hashtagu Telugu Desk
Chakri Death: ప్రముఖ సంగీత దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు చక్రి. తన పాటలతో ఎంతోమందిని ఫిదా చేశాడు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా తన సంగీతంతో బాగా ఫిదా చేశాడు. దాదాపు 85 సినిమాలకు తన సంగీతాన్ని అందించాడు. అయితే ఈయన 2014 డిసెంబర్ 15లో అనారోగ్య సమస్యతో తుది శ్వాస విడిచారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన అభిమానులు అస్సలు మర్చిపోలేక పోతున్నారు. ఇక ఈయన గురించి తాజాగా తన సోదరుడు మహతి నారాయణ్ కొన్ని విషయాలు పంచుకున్నాడు.
ప్రస్తుతం మహతి కూడా దర్శకుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చక్రి మరణం గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. మ్యూజిక్ ఫీల్డ్ లోకి రావద్దు అనుకున్నానంటూ.. కానీ చక్రి తర్వాత జనరేషన్ కు వారసులు ఉండొద్దా అని అన్నాడని.. ఇక తన ఇన్ఫ్లుయెన్స్ తనమీద పడకూడదు అనేవాడు అని కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత తనను వారసుడిని చేస్తాడనుకోలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు.
అటువంటి వారసత్వం ఇచ్చినప్పుడు కష్టపడాలి అని.. ఇంక సాధించాలని.. తన అన్నయ్య మరణం జీవితంలో తీరని లోటు అని అన్నాడు. ఇక తన తల్లి ఇప్పటికీ ఆ విషాదం నుండి బయటపడలేదని.. ఆ బాధతోనే కాలం గడుపుతుంది అని అన్నాడు. ఇక ఇంట్లో టీవీ పెట్టాలన్న భయమేస్తుంది అని.. ఎక్కడ అన్నయ్య పాటలు వస్తే తను ఏడుస్తుందో అని.. టీవీ పెట్టకపోతే అన్నయ్య గురించి వినబడట్లేదు అని బాధపడుతుందని అన్నాడు.
ఇక ఒకవైపు మానసికకు క్షోభతో పాటు ఆర్థిక కష్టాలతో బతుకుతూ వెల్లదీస్తున్నామని.. తన అన్నయ్య మరణించిన సమయానికి తమ ఇంట్లో లేము అంటూ.. సమయంలో తమ వదినతో జరిగిన గొడవ వల్ల వేరే ఇంట్లో ఉన్నాము అని.. ఇక ఆరోజు రాత్రి తన అన్నయ్య తమ దగ్గరికి వచ్చి మళ్లీ ఇంటికి వెళ్ళిపోయాడు అని.. ఇక మరుసటి రోజే అన్నయ్య మరణ వార్త వినాల్సి వచ్చింది అని అన్నాడు.
తన అన్నయ్య మరణం పై తనకి ఇప్పటికీ అనుమానం ఉంది అంటూ.. ఆయనది సహజ మరణం అయినప్పుడు పోస్టుమార్టం చేయించడానికి ఎందుకు భయపడ్డారు అని ప్రశ్నించాడు. రాత్రి తమ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ విషయం పెట్టి చంపింది అని పోలీసులు ఫిర్యాదు చేశారు అంటూ.. ఎక్కడైనా కొడుకులు కన్నతల్లి విషయం పెట్టి చంపుతుందా.. దురదృష్టవశాత్తు ఆయన ఎలా చనిపోయారు అనేది నిరూపించుకోలేకపోయాము అని బాధపడ్డాడు.
ఇక అన్నయ్య చనిపోయాక తన స్టూడియో తనకు వచ్చింది అని ప్రచారం నడిచింది అంటూ.. అందులో ఎటువంటి నిజం లేదంటూ.. ఎవరో కావాలని స్టూడియో బయట సోఫాలు తగలబెట్టి ఆ నేరం తమపై మోపారు అని.. ఇక స్టూడియో కి వెళ్లి చూస్తే అన్ని సామాన్లు ఎత్తుకెళ్లారు అని.. అన్నయ్య గుర్తులు ఏవీ లేకుండా పోయాయి అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.