Ramyakrishna : నాని సినిమాలో శివగామి..?
Ramyakrishna బాహుబలి లో శివగామి పాత్ర అయితే ఆమె కోసమే అన్నట్టుగా చేసింది. ఆ సినిమా తర్వాత రమ్యకృష్ణ కెరీర్ మళ్లీ పుంజుకుంది. ఐతే నాని లాంటి టాలెంటెడ్ హీరో సినిమాలో రమ్యకృష్ణ
- By Ramesh Published Date - 08:05 AM, Fri - 29 November 24

నాచురల్ స్టార్ నాని ఈ ఇయర్ సరిపోదా శనివారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నాని కూడా చిన్నగా మాస్ హీరోగా టర్న్ అయ్యాడు. ప్రస్తుతం నాని హిట్ 3 సినిమా చేస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కం థ్రిల్లర్ మూవీగా రాబోతుంది.
ఇక ఈ సినిమా తర్వాత దసరా (Dasara) డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా చేస్తాడని తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఐతే సినిమాలో కాస్టింగ్ ని ఎంపిక చేసే పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ క్రమంలో నాని సినిమాలో శివగామి రమ్యకృష్ణ (Ramyakrishna ) ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రమ్యకృష్ణ ఇప్పటికీ తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా అదరగొట్టేస్తుంది.
బాహుబలి (Bahubali)లో శివగామి పాత్ర అయితే ఆమె కోసమే అన్నట్టుగా చేసింది. ఆ సినిమా తర్వాత రమ్యకృష్ణ కెరీర్ మళ్లీ పుంజుకుంది. ఐతే నాని (Nani,) లాంటి టాలెంటెడ్ హీరో సినిమాలో రమ్యకృష్ణ నటించడం ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. కచ్చితంగా రమ్యకృష్ణకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ పడి ఉంటుందని అనుకుంటున్నారు.
ఈ సినిమాకు పారడైస్ (aradise) అనే టైటిల్ పెడుతున్నారని తెలిసిందే. చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేయకముందే ఈ సినిమా టైటిల్ లీక్ అయ్యింది. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో భారీ సినిమాతో రాబోతున్నాడు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.
Also Read : Pushpa 2 : పుష్ప 2 సింగిల్ టేక్ సీన్ గురించి తెలుసా.. థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే అటగా..!