Shiva Rajkumar Health : అనారోగ్యం తో బాధపడుతున్న స్టార్ హీరో..ఆందోళనలో ఫ్యాన్స్
Shiva Rajkumar : కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారిగా స్పందిస్తూ, ఇటీవల జరిగిన అనారోగ్య సమస్యల కారణంగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు వెల్లడించారు
- By Sudheer Published Date - 08:08 PM, Fri - 8 November 24

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar Health) అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారిగా స్పందిస్తూ, ఇటీవల జరిగిన అనారోగ్య సమస్యల కారణంగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు వెల్లడించారు. శివరాజ్ కుమార్ ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఆందోళన చెందినా, తన ఆత్మవిశ్వాసం వల్ల దానిని అధిగమించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.
ఇప్పటివరకు నాలుగు విడతలుగా చికిత్స తీసుకున్నట్లు, ప్రస్తుతం కూడా ట్రీట్‌మెంట్ కొనసాగుతోందని వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా అభిమానులు ఇబ్బంది పడకూడదని, అనవసరమైన ఊహాగానాలకు అడ్డుకట్ట వేయాలని తన ఆరోగ్యంపై నిజమైన పరిస్థితి గురించి బయటపెట్టానని వివరించారు. త్వరలోనే సర్జరీ కోసం అమెరికా వెళుతున్నానని, నెలరోజులు రెస్ట్ తీసుకుంటానని వెల్లడించారు. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని భావిస్తున్నానని… షూటింగులు, ప్రమోషన్స్ కు హాజరవుతున్నానని శివరాజ్ కుమార్ తెలిపారు. మొన్నటి వరకు శివరాజ్ అనారోగ్యం పై వార్తలు ప్రచారం అయినప్పటికీ కొంతమంది అభిమానులు పుకార్లే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు శివరాజే చెప్పడం తో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు శివరాజ్ కు ఏ సమస్య వచ్చింది..? అమెరికా కు వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన వ్యాధా..అది అని మాట్లాడుకుంటున్నారు.
శివరాజ్ కుమార్ తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచతమే. ఇప్పటి వరకు తెలుగులో సినిమా చేయకపోయి డబ్బింగ్, రీమేక్ చిత్రాలతో ఆయన ఇక్కడ గుర్తింపు పొందారు. మరికొద్ది రోజుల్లో ఆయన తెలుగు చిత్రాలతో ఇక్కడ ఆడియన్స్‌ని అలరించబోతున్నారు. ప్రముఖ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ కుమారుడే శివరాజ్. “శివన్న” అని అభిమానులు ప్రేమతో పిలుస్తారు. కన్నడ చిత్ర పరిశ్రమలో విభిన్న చిత్రాల్లో తన నటనతో పేరొందారు. ఆయన నటించిన కొన్ని ప్రధాన చిత్రాలు “ఒం,” “జోగి,” “భజరంగి,” “తగరు,” “రుస్తుం” లాంటి సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి.
Read Also : CM Revanth Reddy : BRS నేతలకు అసలు సినిమా ఏంటో చూపిస్తా – సీఎం రేవంత్