Indian 3 : ఇండియన్ 3 కూడా థియేటర్ లోనే..!
Indian 3 ఇండియన్ 2 రిజల్ట్ చూసి పార్ట్ 3 ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. ఐతే ఇండియన్ 2 సినిమా రిజల్ట్ ఇంకా పార్ట్ 3 మీద లేటెస్ట్ గా శంకర్ కామెంట్స్ చేశారు. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా తమిళ్ మీడియా తో
- By Ramesh Published Date - 07:25 AM, Fri - 20 December 24

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar,) డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ క్రేజ్ ఉంటుంది. ఆయన ఎలాంటి సినిమా తీసినా అందులో ఏదో ఒక సోషల్ కాజ్ ఉంటుంది. ఐతే ఇండియన్ 2 సినిమా శంకర్ కి చాలా తలనొప్పి తెచ్చి పెట్టింది. సూపర్ హిట్ సినిమా ఇండియన్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఐతే ఇండియన్ 2 తో పాటే ఇండియన్ 3 సినిమా కూడా తెరకెక్కించారు. ఇండియన్ 2 ఎండింగ్ లో ఇండియన్ 3 (Indian 3) కి సంబందించిన ట్రైలర్ వదిలారు.
ఐతే ఇండియన్ 2 రిజల్ట్ చూసి పార్ట్ 3 ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. ఐతే ఇండియన్ 2 సినిమా రిజల్ట్ ఇంకా పార్ట్ 3 మీద లేటెస్ట్ గా శంకర్ కామెంట్స్ చేశారు. Ram Charan గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా తమిళ్ మీడియా తో మాట్లాడిన శంకర్ ఇండియన్ 2 కి వచ్చిన నెగిటివిటీ చూసి షాక్ అయ్యానని అన్నారు. ఆ సినిమాను చాలా మంది విమర్శించారు. అది నేను ఊహించలేదని అన్నారు శంకర్.
అంతేకాదు ఇండియన్ 3 సినిమా మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అన్నారు శంకర్. సో శంకర్ చెప్పిన దాన్ని బట్టి ఇండియన్ 3 సినిమా కూడా థియేటర్ రిలీజ్ ఉంటుంది అన్నమాట. ఏది ఏమైనా థియేట్రికల్ రిలీజ్ అనగానే మళ్లీ ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. గేం ఛేంజర్ సినిమా వర్క్ అవుట్ అయితే ఇండియన్ 3 థియేట్రికల్ రిలీజ్ కన్ ఫర్మ్ అయినట్టే లెక్క.
గేం ఛేంజర్ సినిమా విషయానికి వస్తే ఒక మంచి కమర్షియల్ సినిమాగా వస్తుంది. చరణ్, కియరా అద్వాని లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి కానుకగా రాబోతుంది.