HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Shakunthalam Movie Into 3d Technology

Samantha: 3D టెక్నాలజీలోకి ‘శాకుంతలం’.. మూవీ విడుదల వాయిదా!

లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను రూపొందిస్తూ.. అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందిస్తోన్న ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌.

  • Author : Balu J Date : 30-09-2022 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shakunthalam
Shakunthalam

లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను రూపొందిస్తూ.. అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందిస్తోన్న ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌. ఆయన ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన ప్రణయ దృశ్య కావ్యం శాకుంతలం’.  మ‌హాభార‌త ఇతిహాసంలో అద్భుత‌మైన ప్రేమ ఘ‌ట్టంగా చెప్పుకుంటూ ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీన్ని ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నారు. శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్ర‌ణ‌య‌గాథ ఇది. శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.

‘శాకుంతలం’ చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  అయితే ఇలాంటి దృశ్య కావ్యాన్ని చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడు మ‌ధుర‌మైన అనుభూతికి లోను కావాలి.. ఆ అనుభూతుల‌ను త‌న‌లో భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌నే త‌లంపుతో ఎపిక్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌.. ‘శాకుంతలం’ సినిమాను 3Dలో ఆందించే ప్రయత్నం చేస్తున్నారు.

‘‘అత్యంత భారీ స్థాయిలో, అత్యద్భుతంగా శాకుంతం చిత్రాన్ని మీకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం.  అందుకే, ఇంతకు ముందు ప్రకటించిన సమయానికి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం. ఇప్పటిదాకా అడుగడుగునా మమ్మల్ని ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం’’  అని చిత్ర యూనిట్ తెలియజేసింది.

‘శాకుంతలం’ మనసుని హత్తుకునే అందమైన ప్రేమ కథ. ఇందులో భారీ తారాగ‌ణం కూడా నటించారు.   స‌చిన్ ఖేడేక‌ర్‌, క‌బీర్ బేడీ, డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌క‌రాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3d
  • Heroine samantha
  • latest tollywood news
  • shakuntalam movie

Related News

NTR-Trivikram movie... the poster looks amazing!

NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సరికొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవ

    Latest News

    • GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

    • Kuppam : అలాంటి ప్రచారాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగదు : సీఎం చంద్రబాబు

    • Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

    • Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

    • KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

    Trending News

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd