Shah Rukh Pathaan Records: షారుఖ్ ఖాన్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు.. రిలీజ్ కు ముందే 50 కోట్లు!
షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల టికెట్లు (Tickets) అమ్ముడుపోవడం విశేషం.
- Author : Balu J
Date : 21-01-2023 - 5:17 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు. చివరగా ‘జీరో’ సినిమాతో వచ్చిన షారుఖ్ మార్కెట్ లో కూడా దాదాపు జీరో కావాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దీంతో రెండేళ్లు సినిమాకు దూరం కావాల్సి వచ్చింది. అయితే ఎన్నో కథలు విని.. చివరికి యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ (Pathaan) సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు.
ఐతే రిలీజ్ ముంగిట ప్రమోషన్ల హడావుడి తప్పదని ఒక పాట రిలీజ్ చేస్తే దాని మీద పెద్ద వివాదమే నడిచింది. దెబ్బకు షారుఖ్ (Shah Rukh Khan) మళ్లీ సైలెంట్ అయిపోయాడు. మరోవైపు షారుఖ్ అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులను ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. దీపికా బికినీ సాంగ్ కూడా హైలైట్ గా నిలిచింది. మొత్తంగా రిలీజ్ ముంగిట ఈ సినిమాకు ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ (Advance bookings) మొదలవడం ఆలస్యం.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
నాలుగు రోజుల వ్యవధిలో పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్ మల్లీప్లెక్స్ ఛైన్స్ దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల టికెట్లు (Tickets) అమ్మేయడం విశేషం. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.15 కోట్ల దాకా వసూళ్లను రాబట్టేసిందట ‘పఠాన్’. ఇక రిలీజ్ ముందు రోజు వరకు జరిగే ప్రి సేల్స్, తొలి రోజు బుకింగ్స్ కలుపుకుంటే ఈజీగా రూ. 50 కోట్ల మార్కును ‘పఠాన్’ టచ్ చేసేలా కనిపిస్తోంది. అయితే ఈ మూవీని చూడాలనుకుంటున్న చాలామందికి టికెట్స్ దొరకలేదు. ఇక హైదరాబాద్ లో అయితే ఓ మల్టీపెక్స్ టికెట్ కు 450 రూపాయలను వసూలు చేస్తోంది. (Shah Rukh Khan) పఠాన్ మూవీ ఆన్ లైన్ టికెట్స్ బుకింగ్స్ దెబ్బకు బుక్ మై షో సైట్ క్రాష్ అయిందంటే షారుఖ్ పఠాన్ క్రేజ్ ఎలా ఉందో ఇట్టే అర్దమవుతోంది.
Also Read: Kantara 2 confirmed: కాంతార ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో ‘కాంతార 2’