Sapta Sagaralu Dati : స్ట్రైట్ సినిమా రేంజ్ లో ప్రమోషన్స్..!
కన్నడలో సూపర్ హిట్టైన సప్త సాగర దాచె ఎల్లో సినిమాను తెలుగులో సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dati ) అనే టైటిల్
- Author : Ramesh
Date : 22-09-2023 - 6:40 IST
Published By : Hashtagu Telugu Desk
కన్నడలో సూపర్ హిట్టైన సప్త సాగర దాచె ఎల్లో సినిమాను తెలుగులో సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dati ) అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. హనుమంత్ ఎం రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి, రుఖ్మిణి వసంత్ జంటగా నటించారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో ఈ నెల 1న రిలీజై సూపర్ సక్సెస్ అయ్యింది. కన్నడ వెర్షన్ చూసిన తెలుగు ఆడియన్స్ సినిమాను తెలుగులో డబ్ చేస్తే చూడాలని ఉందని కోరుకున్నారు.
వారు కోరినట్టుగానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సప్త సాగర దాచె ఎల్లో సినిమాను తెలుగులో సప్త సాగరలు దాటి అని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ చూస్తే ఒక స్ట్రైట్ సినిమాకు కూడా ఈ రేంజ్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వలేదని చెప్పొచ్చు. డైరెక్టర్ హేమంత్ హీరో కం ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టి ఇద్దరు కలిసి సోషల్ మీడియా లో రివ్యూయర్స్ అందరికీ ఇంటర్వ్యూస్ ఇచ్చారు.
ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వారికి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇంటర్వ్యూ ఇవ్వగా సోషల్ మీడియా యూట్యూబర్స్ కి ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. తమ సినిమా (Sapta Sagaralu Dati )కు అద్భుతమైన రివ్యూస్ ఇచ్చిన ప్రతి ఒక్కరి చేత టీం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూస్ ద్వారా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సప్త సాగరాలు దాటి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.
వెండితెర మీద ప్రేమకథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సరిగా తీయాలే కానీ వాటిని చూసేందుకు ఆడియన్స్ ఎగబడతారు. ప్రస్తుతం కన్నడలో ఈ సినిమా సూపర్ సక్సెస్ కాగా తెలుగులో ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. నేడు రిలీజైన సప్త సాగరాలు దాటి సినిమాకు రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయి. మరి సినిమా ఇక్కడ కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Kumari Srimathi Trailer : అబ్దుల్ కలాం.. రజినికాంత్.. ఇటికెలపూడి శ్రీమతి..!