Box Office : ‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ
Box Office : ఇప్పటికే ఈ చిత్రం రూ.130+ కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి రూ.161కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి
- By Sudheer Published Date - 01:18 PM, Sun - 19 January 25

2025 సంక్రాంతి (Sankranti ) బరిలో అసలైన బ్లాక్ బస్టర్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthi Vasthunnam ) మూవీ నిలిచింది. సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారని మరోసారి రుజువైంది. వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ లో నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.
Nara Lokesh : లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే – సోమిరెడ్డి
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ మూవీ..విడుదల తర్వాత మొదటి ఆట తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130+ కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి రూ.161కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ పొందడంతో బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని , చాలామంది టికెట్స్ దొరకక వెనుతిరుగుతున్నారని తెలిపారు.
Rose Petals : ఇంట్లోనే గులాబీ రేకుల హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకోండి
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కలెక్షన్ల చూస్తే.. తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది. దీంతో వెంకటేష్ కెరీర్‌లో హైయ్యేస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం. ఇక రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్లు, ఈ సమయంలోనే 3 రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక నాలుగో రోజు రూ. 16 కోట్లు వసూలు చేయగా ఓవరాల్ గా ఐదు రోజుల్లో రూ.161కోట్లు రాబట్టి..అసలైన సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.