Sanjay Dutt Remuneration: సంజయ్ దత్ చాలా రిచ్ గురూ.. చిన్న పాత్రకే 10 కోట్లు!
బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్తు ఓ చిన్న పాత్రకే 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడా? అంటే అవునని అంటోంది బాలీవుడ్
- Author : Balu J
Date : 08-12-2022 - 3:15 IST
Published By : Hashtagu Telugu Desk
భారీ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt). కేజీఎఫ్ 2లో తన నటనతో ఆకట్టుకున్న ఈ స్టార్ కు పలు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. దీంతో సంజయ్ దత్తు (Sanjay Dutt)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమాలో ఒక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt)ని అడిగారు. ఒక చిన్న పాత్ర కోసం నటుడు 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడిగినట్టు తెలుస్తోంది. సూపర్ హిట్ మూవీ KGF2 లో నటించిన తర్వాత, సంజయ్ దత్ (Sanjay Dutt) పారితోషికం విషయంలో రాజీ పడడం లేదని బాలీవుడ్ (Bollywood) వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. ధనుష్ ఇప్పటివరకు తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సర్’, తమిళంలో అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా కమ్ముల-ధనుష్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కబోతోంది. మరి సంజయ్ కు (Sanjay Dutt) 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తారా? లేదా ఆయన స్థానంలో మరో నటుడ్ని ఎంపిక చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
Also Read: Prabhas Unstoppable: క్రేజీ అప్డేట్.. బాలయ్య షోకు ప్రభాస్, ఫ్యాన్స్ కు పూనకాలే!