Ranbir Kapoor : స్పిరిట్ ముందు రణ్ బీర్ తో మరోటి.. సందీప్ ప్లానింగ్ ఛేంజ్ వెనక రీజన్ అదేనా..?
యానిమల్ తో సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor)
- By Ramesh Published Date - 07:09 PM, Sat - 16 December 23

యానిమల్ తో సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) లీడ్ రోల్ లో వచ్చిన యానిమల్ సినిమా రిలీజైన నాటి నుంచి సెన్సేషనల్ గా దూసుకెళ్తుంది. ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటించింది. యాక్షన్ లవ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా విషయంలో సందీప్ వంగ నమ్మకం నిలబడింది.
ఇక ఇదిలాఉంటే సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో చేయాల్సి ఉంది. స్పిరిట్ అంటూ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. యానిమల్ రిలీజ్ ముందు స్పిరిట్ పై ఆలోచన ఉన్నా ఆఫ్టర్ యానిమల్ రిలీజ్ సందీప్ తన ప్లాన్ మార్చుకున్నారని తెలుస్తుంది. యానిమల్ టీం తోనే మరో సినిమా చేయాలని అనుకుంటున్నారట.
Also Read : King Nag: నాగార్జున క్రేజీ అప్డేట్, నా సామి రంగ టీజర్ రెడీ
రణ్ బీర్ తో సందీప్ వంగ మరో సినిమా ఉంటుందని టాక్. అది కూడా స్పిరిట్ కి ముందే ఆ సినిమా కూడా చేస్తారని తెలుస్తుంది. టీ సీరీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. స్పిరిట్ సినిమాను పక్కన పెట్టి రణ్ బీర్ తోనే సందీప్ వంగ సినిమా చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి యానిమల్ టీం మరో సినిమా అనగానే ఆ సినిమా లవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
సందీప్ వంగ రణ్ బీర్ చేసే మరో సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అంతేకాదు యానిమల్ లో స్పెషల్ రోల్ చేసిన తృప్తి కూడా ఈ సినిమాలో మరో పాత్రలో పోశిస్తుందని టాక్.
We’re now on WhatsApp : Click to Join