Samyukta Menon : సంయుక్త అదిరిపోయే లైనప్..!
Samyukta Menon ప్రస్తుతం మలయాళంలో ఒక క్రేజీ సినిమాను చేస్తున్న సంయుక్త. నిఖిల్ చేస్తున్న స్వయంభు సినిమాలో నటిస్తున్న అమ్మడు శర్వానంద్ తో నారీ నారీ నడుమ మురారి సినిమాలో కూడా
- By Ramesh Published Date - 11:12 PM, Tue - 21 January 25

Samyukta Menon మలయాళ భామ సంయుక్త మీనన్ సౌత్ లో తన మార్క్ చూపిస్తుంది. మొన్నటిదాకా మలయాళంలోనే ఉన్న అమ్మడు భీమ్లా నాయక్ తో తెలుగు ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత ఇక్కడ సోలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ అందుకుంది. అంతేకాదు విరూపాక్షతో తనలో డిఫరెంట్ యాంగిల్ కూడా చూపించింది. ఐతే కెరీర్ మంచి ఫాం లో ఉన్నప్పుడే వరుస సినిమాలు చేయాలన్న ఆలోచనతో కాకుండా సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంది అమ్మడు.
ప్రస్తుతం మలయాళంలో ఒక క్రేజీ సినిమాను చేస్తున్న సంయుక్త. నిఖిల్ చేస్తున్న స్వయంభు సినిమాలో నటిస్తున్న అమ్మడు శర్వానంద్ తో నారీ నారీ నడుమ మురారి సినిమాలో కూడా నటిస్తుంది. దీనితో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. బాలీవుడ్ లో మహారాగ్ని సినిమాలో కూడా నటిస్తుంది సంయుక్త.
సౌత్ లో మంచి డిమాండ్..
మలయాళ భామలకు సౌత్ లో మంచి డిమాండ్ ఉంటుంది. అందంతో పాటు అభినయంతో కూడా మెప్పిస్తారు అందుకే వారంటే ఆడియన్స్ లో ఒక సెపరేట్ క్రేజ్ ఏర్పడుతుంది. సంయుక్త కూడా తెలుగు ఆడియన్స్ కు దగ్గరవుతుంది. కెరీర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే చాలు కానీ అమ్మడు టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు.
చేస్తున్న సినిమాలతో పాటు రకరకాల ఫోటో షూట్స్ తో కూడా సంయుక్త అదరగొడుతుంది. తప్పకుండా ఈ అమ్మడు రాబోతున్న సినిమాలతో మరింత ఊపు ఊపేసేలా ఉందని చెప్పొచ్చు.