Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంతకు ప్రాణాంతక వ్యాధి..!
హీరోయిన్ సమంత MYOSITIS అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతునట్టు తెలిపింది.
- Author : Gopichand
Date : 29-10-2022 - 4:18 IST
Published By : Hashtagu Telugu Desk
హీరోయిన్ సమంత MYOSITIS అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతునట్టు తెలిపింది. దీంతో సమంత ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ఈ వ్యాధికి కండరాల నొప్పి, బలహీనత, ఎముకలు బలం కోల్పోవడం, రక్తహీనత వంటి లక్షణాలుంటాయి. సమంత త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ రిప్లేలు ఇస్తున్నారు.
సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో కండరాలు బలహీనపడటానికి దారితీసే మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. “నేను అతి త్వరలో పూర్తిగా కోలుకుంటానని వైద్యులు తెలిపారు” అని రాసుకొచ్చింది. ఆసుపత్రిలో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది.”యశోద ట్రైలర్‌కి మీ స్పందన చాలా బాగుంది. కొన్ని నెలల క్రితం నాకు మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అది తగ్గిన తర్వాత మీతో పంచుకోవాలని నేను ఆశించాను. కానీ నేను ఆశించిన దానికంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటోంది. అందుకే మీతో పంచుకుంటున్నాను” అని తెలిపింది.
సమంత త్వరలో డౌన్‌టౌన్ అబ్బే దర్శకుడు ఫిలిప్ జాన్‌తో కలిసి అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే ప్రాజెక్ట్‌లో పని చేస్తుంది. ఈ చిత్రంలో సమంత తన సొంత డిటెక్టివ్ ఏజెన్సీని నడిపే ద్విలింగ పాత్రలో నటిస్తుంది. రస్సో బ్రదర్స్ సిటాడెల్‌లో కూడా కనిపించనుంది. సమంత చివరిసారిగా విజయ్ సేతుపతి, నయనతార కలిసి నటించిన కత్తువాకుల రెండు కాదల్ చిత్రంలో కనిపించారు.