చైతు, సమంత బ్రేక్ అప్?
- By Hashtag U Published Date - 03:53 PM, Wed - 15 September 21
సమంత, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని వచ్చిన గాసిప్స్ కు బ్రేక్ పడింది. తిరుపతి దర్శనం తరువాత ఇద్దరూ కలిసి ట్వీట్ చేయడంతో, అప్పటి వరకు వచ్చిన కథనాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల నాగచైతన్య, సమంత మధ్య దూరం పెరిగిందని టాలీవుడ్ టాక్. తన ఇన్ స్ట్రా గ్రామ్ పేజీలోని సమంత అక్కినేని పేరుకు బదులుగా ఎస్ అని ప్రొఫైల్ నేమ్ ను మార్చేసింది. దీంతో వాళ్లిద్దరు ఇక విడిపోతున్నారని సినీ అభిమానుల్లో బలంగా చర్చ నడిచింది. బాలీవుడ్ కు సమంత ప్యాక్ అప్ అయిందని టాలీవుడ్ టాక్. 2017లో ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గోవాలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆనాటి నుంచి హిట్ ఫెయిర్ గా సినీ వర్గాల్లో గుర్తు పొందారు.
కానీ, హఠాత్తుగా ఇద్దరి మధ్య ఏమోచ్చిందో ఏమో గానీ, చైతు, సమంత బ్రేకప్ అంటూ వార్తలు వచ్చాయి. వీటికి అనుగుణంగా అనేక కథనాలు సినీవర్గాల నుంచి వినిపించాయి. షూటింగ్ లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చైతూ కండిషన్ పెట్టాడని, సమంతకు ఆ కండిషన్ నచ్చకపోకవడంతో వాళ్లిద్దరి మధ్య తేడా వచ్చిందని గుసగుసలు. మజిలీ సినిమాలో కెమరా ముందు సమంత తో రొమాన్స్ సీన్ చేయడానికి చైతు ఇబ్బంది పడ్డాడు.
WINNER!!
All the very best to the team @Sai_Pallavi92 🤗.. #LoveStoryTrailer https://t.co/nt9rzTc3lY— S (@Samanthaprabhu2) September 13, 2021
అంతగా ఆమెంటే చైతుకు ప్రేమ. కానీ, ఆ ప్రేమను పొసెసివ్ నెస్ గా సమంత భావిస్తుందట. అందుకే, వాళ్లిద్దరి మధ్య బ్రేక్ అప్ కు బీజం పడిందని సినీవర్గాల్లో టాక్. గత రెండు నెలలుగా చైతు, సమంత మీద నడిచిన పలు పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా ట్వీట్ చేశారు ఇద్దరు. ఫలితంగా తాత్కాలికంగా గాసిప్స్ కు తెరపడిన భవిష్యత్ లో అవి చిలవలు పలువలుగా వస్తాయని సినీ విశ్లేకుల భావన. సో…చైతు, సమంత ఫ్యామిలీ డ్రామాకు క్లైమాక్స్ ఏంటో వేచిచూడాల్సిందే.
Tags
Related News
Samantha: అల్లుఅర్జున్ పై భారీ ఆశలు పెట్టుకున్న సమంత.. ఎందుకంటే
Samantha: ఎన్నో ఆఫర్లు వస్తున్నప్పటికీ సమంత రూత్ ప్రభు వ్యూహాత్మకంగా వెండితెరకు రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమాలో ఈ టాలెంటెడ్ నటి నటిస్తున్నట్లు సమాచారం. పవర్ ఫుల్ రీఎంట్రీ ఇచ్చే సినిమా కోసం చూస్తున్న సమంత, అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే నెక్ట్స్ మూవీ తనకు బెస్ట్ ఛాయిస్ అని నమ్ముతోంది. అల్లు అర్జున్ కు పా�