Samantha : స్పెషల్ సాంగ్స్ చేయనని తెగేసి చెప్పేసిన సమంత..!
Samantha పుష్ప 1లో తాను చేసిన స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ కాగా పుష్ప 2 లో కానీ మరో సినిమాలో స్పెషల్ సాంగ్ వస్తే చేస్తారా అని అడగ్గా
- By Ramesh Published Date - 10:16 PM, Sun - 3 November 24

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తాను ఇక మీదట స్పెషల్ సాంగ్స్ చేయనని చెప్పింది. ఈమధ్య బాలీవుడ్ లో ఒక స్పెషల్ ఈవెంట్ లో పాల్గొన్న అమ్మడు అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది. ముఖ్యంగా పుష్ప 1లో తాను చేసిన స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ కాగా పుష్ప 2 (Pushpa 2) లో కానీ మరో సినిమాలో స్పెషల్ సాంగ్ వస్తే చేస్తారా అని అడగ్గా లేదు ఇక మీదట అలాంటి సాంగ్స్ చేయనని తెగేసి చెప్పేసింది అమ్మడు.
సమంత (Samantha) ఈ నిర్ణయం వెనక రీజన్స్ ఏంటో తెలియదు కానీ తన కెరీర్ లో ఇక మీదట ఆమె బోల్డ్ గా కనిపించడానికి మాత్రం సిద్ధంగా లేదని తెలుస్తుంది. అది కూడా ఆన్ స్క్రీన్ మీద ఆ బోల్డ్ ఇమేజ్ వల్ల పర్సనల్ లైఫ్ డిస్ట్రబ్ అవుతుందని భావిస్తుందని టాక్. ఐతే సమంత ప్రస్తుతం సిటాడెల్ (Citadel) వెబ్ సీరీస్ లో నటిస్తుంది. ఈ సీరీస్ తో మరోసారి అమ్మడు తన సత్తా చాటేలా ఉంది..
సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం..
ఇక మరోపక్క తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది సమంత. తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీదే పెడుతున్న సమంత సౌత్ సినిమాలపై అంతగా ఆసక్తి చూపించట్లేదని టాక్. ఐతే మంచి ఆఫర్ వస్తే మాత్రం అమ్మడు తెలుగు సినిమా చేసి తీరుతుందని కొందరు అంటున్నారు.
ఏది ఏమైనా సమంత మళ్లీ స్పెషల్ సాంగ్ లో చూడకపోవడం ఆమె ఫ్యాన్స్ కి నిరాశే అయినా కనీసం అమ్మడు సినిమాలు చేస్తే చాలని అనుకుంటున్నారు.