Samantha Spotted: సమంత ఈజ్ బ్యాక్.. ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి
టాలీవుడ్ నటి సమంత వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంది.
- By Balu J Updated On - 05:45 PM, Fri - 6 January 23

టాలీవుడ్ నటి సమంత (Samantha) వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఆమె ఇంటి నుంచి బయట అడుగుపెట్టారు. శుక్రవారం ముంబైలో (Mumbai) కనిపించింది. అక్టోబర్‌లో యునైటెడ్ స్టేట్స్ నుండి తిరిగి వచ్చిన తర్వాత మొదటి సారి మీడియాకు కనిపించింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సమంత కనిపించడంతో సందడి నెలకొంది. ఆమె గత మూడు నెలలుగా బయటి ప్రపంచానికి దూరంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే సమంతకు హోమ్ క్వారంటైన్ లాంటిది.
సమంత (Samantha) తిరిగి సినిమా సెట్స్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ “ఖుషి” సినిమాతో పాటు హిందీ వెబ్ సిరీస్ “సిటాడెల్” చిత్రీకరణలో పాల్గొంటుంది. సమంత కోసం “ఖుషి” టీమ్ నెలల తరబడి ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఖుషి సినిమాకు సంబంధించిన కొన్ని షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసింది. ఇక “సిటాడెల్” టీమ్ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభించనుంది. చాలా రోజుల తర్వాత సమంత కనిపించడంతో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం సమంత (Samantha) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samantha | Mumbai Airport!
— Christopher Kanagaraj (@Chrissuccess) January 6, 2023

Related News

Suhas Exclusive: శభాష్ సుహాస్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో దాకా!
చిన్న పాత్రలకే పరిమితమైన సుహాస్ ‘కలర్ ఫోటో’ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.