Salaar Trailer : సలార్ ట్రైలర్ టాక్..
ప్రభాస్ ఎంట్రీ ఓ రేంజ్ లో చూపించారు. పెద్ద పెద్ద గోడలు కట్టేది భయంతో.. బయటకు ఎవరో పోతారని కాదు.. లోపలికి ఎవరు వస్తారని.. లాంటి డైలాగ్స్ ప్రభాస్ చెబుతుంటే వినడానికి ఎంతో మస్త్ గా ఉంది
- By Sudheer Published Date - 09:25 PM, Fri - 1 December 23
సలార్ నుండి అసలైన ట్రైలర్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ (Salaar ) మూవీ ఫై అంచనాలు ఏ స్థాయి లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. KGF సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మూవీ కావడం..ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తుండడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో శుక్రవారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై మరింత అంచనాలు పెంచారు.
ఫ్రెండ్షిప్.. రాజకీయం.. కుళ్ళు.. కుతంత్రాలతో సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైలర్ మొదలు.. ఇద్దరు స్నేహితులను కనిపిస్తారు. అందులో ఒకరు ప్రభాస్, మరొకరు ఆయన స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్. చిన్నప్పటి పాత్రల్లో వీరు ఉండగా.. తన స్నేహితుడిని ఎవరో ఏదో అన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ప్రభాస్ అతడి చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ.. ఎవడాడు, ఎవడు అంటూ గట్టిగా అడుగుతుండగా.. స్నేహితుడు మాత్రం భయంతో ఏడుస్తూ వద్దురా దేవ వద్దు అంటూ కనిపిస్తాడు. సినిమాలో ప్రభాస్ పేరు దేవా గా అర్ధం అవుతుంది.
స్నేహితుడి కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతానంటూ చిన్నప్పటి ప్రభాస్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఫ్రెండ్ పిలిస్తే అతడి కోసం మళ్లీ ఇక్కడికి వస్తానంటూ చెప్పడం తెగ ఆకట్టుకుంటోంది. ఖాన్ సార్ అడవిలో ఏర్పడ్డ సామ్రాజ్యం ఆధిపత్యం కోసమే ఈ సినిమా సాగుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆ స్థానం కోసం ప్రాణాలకు తెగించగా… ప్రభాస్ స్నేహితుడు కోసం దాని కోసం పోటీ పడతాడు. అయితే దాన్ని దక్కించుకోలేకపోతాడు. ఆ తర్వాత నారంగ్ రష్యా వాళ్లను, కురుంగ్ వాళ్లు సెర్బియన్ ఆర్మీని తెచ్చుకున్నారు.. మనం ఎవరిని తెచ్చుకుందామని ప్రభాస్ స్నేహితుడిని ఆయన అనుచరుచులు అడగుతూ కనిపిస్తారు. మన ఆర్మీ ఎవరు అంటూ ప్రశ్నించగా.. అదిరిపోయే లుక్ లో ప్రభాస్ కనిపించాడు. తన స్నేహితుడిని ఖాన్ సార్ అధిష్టానంపై చూసేందుకు ప్రభాస్ యే అతడి ఆర్మీగా మారి ఫైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ కు ఆయన స్నేహితుడు నా కళ్ల ముందు కనిపిస్తున్నదంతా నాక్కావాలని అని చెప్పడం, మన బ్లెడ్ లోనే వైలెన్స్ ఉందంటూ జగ్గూభాయ్ చెప్పడం కడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కేజిఎఫ్ లో ఉన్నట్టుగానే ఇందులో కూడా కాన్సారా అనే ఒక బందిపోటుల సామ్రాజ్యాన్ని చూపించారు. ప్రభాస్ ఎంట్రీ ఓ రేంజ్ లో చూపించారు. పెద్ద పెద్ద గోడలు కట్టేది భయంతో.. బయటకు ఎవరో పోతారని కాదు.. లోపలికి ఎవరు వస్తారని.. లాంటి డైలాగ్స్ ప్రభాస్ చెబుతుంటే వినడానికి ఎంతో మస్త్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా సెట్ అయింది.హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్.. రాబోయే చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రభాస్ గెటప్ కూడా ఈ మూవీలో సూపర్ గా ఉంది.
Subramanyam from Kuppam welcomes Deva of Khansar world to take charge!! #Salaar trailer looks fierce!!https://t.co/XVLprgsCaw
— Sudheer Babu (@isudheerbabu) December 1, 2023
Tags
Related News
Kalki 2898 AD : సినిమా రిలీజ్ కంటే ముందే.. కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ రిలీజ్..!
సినిమా రిలీజ్ కంటే ముందే కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుందట. ఆ సిరీస్ ఎండింగ్ తోనే మూవీ స్టార్ట్ కానుందట.