Doctor Sai Pallavi : డాక్టర్ పట్టా అందుకున్న సాయి పల్లవి
చిత్రసీమలో రాణిస్తూనే కొంతమంది హీరోయిన్లు తమ చిరకాల కోర్కెలు తీర్చుకుంటారు. ఆలా సాయి పల్లవి కూడా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క డాక్టర్ చదువు చదువుకుంది.
- By Sudheer Published Date - 05:36 PM, Tue - 9 July 24

తన నటన , డాన్స్ లతో ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి (Sai Pallavi..ఇప్పుడు తన వైద్యం తో పేషంట్ల ను ఫిదా చేయబోతుంది. తాజాగా ఈమె డాక్టర్ పట్టా (Sai Pallavi Receives her Doctor Degree)ను అందుకుంది. చిత్రసీమలో రాణిస్తూనే కొంతమంది హీరోయిన్లు తమ చిరకాల కోర్కెలు తీర్చుకుంటారు. ఆలా సాయి పల్లవి కూడా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క డాక్టర్ చదువు చదువుకుంది. జార్జియా దేశంలోని Tbilisi State Medical University లో ఈమె మెడిసిన్ చేసింది. తాను మెడిసిన్ చదువుతున్నట్లు పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. డాక్టర్ వృత్తి చేపట్టి అనేకమంది ప్రాణాలు కాపాడాలని , డాక్టర్ గా సేవ చేయాలనీ భావిస్తున్నట్లు తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
హీరోయిన్ గా రిటైరయ్యాక డాక్టర్ గా స్థిర పడతానంటూ పేర్కొంది కూడా. తాజాగా ఆమె ఎమ్‌బీబీఎస్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. జార్జియాలోని మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన సాయిపల్లవి రెండు రోజుల క్రితం జార్జియా వెళ్లి తాను చదివిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పట్టా స్వీకరించింది. గ్రాడ్యుయేషన్ డే రోజు తన కాలేజీలో ఫ్రెండ్స్ తో సరదాగా గడిపింది. దీంతో అక్కడ సాయి పల్లవి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇపుడు సాయి పల్లవి కాదు డాక్టర్ సాయి పల్లవి అనాలి అని అంటున్నారు అభిమానులు.
తమిళనాడుకు చెందిన సాయిపల్లవి .. తెలుగులో డ్యాన్స్ షోలోనూ పార్టిసిపేట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు ఎంబీబీఎస్ చేస్తూనే మరోవైపు నటిగానూ అవకాశాలు దక్కించుకుంది. ప్రేమమ్ తో మలయాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. తెలుగులో ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, MCA తదితర చిత్రాలతో విపరీతమైన పాపులార్టీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య సరసన తండేల్ మూవీ చేస్తుంది. చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇందులో సత్య పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి. హిందీలో రామాయణ్ మూవీలోనూ నటిస్తోంది.
Watch #SaiPallavi from her MBBS Graduation Day at Tbilisi State Medical University, Georgia.
The actress will next be seen in #Thandel starring #NagaChaitanya. pic.twitter.com/rWjvSKMzvN
— KLAPBOARD (@klapboardpost) July 6, 2024
Read Also : Dreams: కలలో వజ్రాలు, నగలు కనిపించాయా.. అయితే జరిగేది ఇదే?