Dreams: కలలో వజ్రాలు, నగలు కనిపించాయా.. అయితే జరిగేది ఇదే?
మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డకలలు. రకరకాల పక్షులు జంతువులు కీటకాలు, దేవుళ్ళు దయ్యాలు అంటూ ఇలా రకరకాల కలలు వస్తూ ఉంటాయి. కొంతమంది మంచి కలలు వచ్చి
- By Anshu Published Date - 05:13 PM, Tue - 9 July 24

మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డకలలు. రకరకాల పక్షులు జంతువులు కీటకాలు, దేవుళ్ళు దయ్యాలు అంటూ ఇలా రకరకాల కలలు వస్తూ ఉంటాయి. కొంతమంది మంచి కలలు వచ్చినప్పుడు సంతోషపడి పీడకలలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. ప్రతి స్వప్న శాస్త్రం ప్రకారం కలలు భవిష్యత్ ను సూచిస్తాయని చెబుతూ ఉంటారు. ఇకపోతే మహిళలకు ఐదు రకాల కలలు వస్తే మంచిది అంటున్నారు పండితులు.
ఇంతకీ ఆ కలలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎవరైనా వివాహం కాని మహిళలక కలలో వజ్రాలు లేదా వజ్రాలు పొదిగిన ఆభరణాలను చూస్తే, ఉన్నత స్థాయి అధికారిని లేదా ధనిక వ్యాపారవేత్తతో వివాహం జరిగే అవకాశం ఉందని అర్థం. అదేవిధంగా ఒక స్త్రీ కలలో అందమైన పక్షిని చూసినట్లయితే ప్రేమ వివాహంగా మారడానికి ఎక్కువ కాలం పట్టదని అర్థం. కాబోయే జీవిత భాగస్వామి త్వరలో ధనవంతుడు కాబోతున్నాడని అర్థం. ఎవరైనా స్త్రీ మంచం మీద పడుకున్నట్లు కలగంటే ఆమె త్వరలో చాలా మంచి ప్రేమికుడిని లేదా భాగస్వామిని కలుసుకోనున్నదని అర్ధం.
అలాగే ఆ సంబంధం పెళ్లికి దారి తీస్తుందని అర్థం. యుక్తవయస్సు లేదా యువతి కలలో పనులు చేసుకుంటున్న కార్మికుడు కనిపిస్తే ఆ యువతికి త్వరలో శివుడులా ప్రేమించే వరుడు లభిస్తాడని అర్థం. అతన్ని కలవవచ్చు లేదా డేట్ కు వెళ్ళే అవకాశం కూడా ఉందని అర్థం. కాబట్టి మహిళలకు ఈ విధమైన కలలు వస్తే శుభసూచకంగా భావించాలి అంటున్నారు పండితులు.