Nani : నాని సినిమాకు ఈ రన్ టైం సరిపోదా..?
- By Ramesh Published Date - 11:59 AM, Wed - 7 August 24

Nani న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తుండగా సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న నాని ఈసారి కూడా ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. నాని తో ఆల్రెడీ అంటే సుందరానికీ సినిమా చేసిన వివేక్ ఆత్రేయ (Vivek Athreya) ఈసారి సరిపోదా శనివారం తో వస్తున్నడు.
ఆగష్టు 29న రిలీజ్ లాక్ చేసిన ఈ మూవీ ప్రచార చిత్రాలన్నీ కూడా అదిరిపోతున్నాయి. నాని సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చిన ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే నాని సరిపోదా శనివారం రన్ టైం గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. సినిమా సెన్సార్ కు వెళ్లకుండానే రన్ టైం మాత్రం లీక్ అయ్యింది.
నాని సరిపోదా శనివారం (Saripoda Shanivaram) సినిమా 2 గంటల 35 నిమిషాలు అంటే 155 నిమిషాల పాటు సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్య సినిమా ఎంగేజింగ్ గా ఉంటే లెంగ్త్ గురించి అసలు పట్టించుకోవట్లేదు ఆడియన్స్. అందుకే నాని సరిపోదా శనివారం సినిమాను రెండున్నర గంటల పాటు రన్ టైం తో తెస్తున్నారు. ఈ సినిమాలో నాని శనివారం మాత్రమే విలన్ల మీద దాడి చేసేలా కథాంశం ఉందని తెలుస్తుంది.
ప్రమోషనల్ కంటెంట్ అయితే అదిరిపోగా సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. నాని మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటుగా సినిమాలో మాస్ అంశాలు కూడా ఫ్యాన్స్ ని మెప్పిస్తాయని తెలుస్తుంది. నాని ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల తో మరో సినిమా లాక్ చేసుకున్నాడు. నాని తో దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఈసారి దానికి మించిన ప్రాజెక్ట్ తో రాబోతున్నాడని తెలుస్తుంది.
Also Read : Prabhas : వయనాడ్ బాధితుల కోసం 2 కోట్లు ప్రకటించిన స్టార్ హీరో..!