Ruhani Sharma : రుహాని శర్మ వీడియో వైరల్.. ఏం జరిగింది..?
నటన పరంగా అలరిస్తున్న అమ్మడు ఆఫ్ స్క్రీన్ మాత్రం ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. ఐతే రుహాని శర్మ గ్లామర్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గదు.
- By Ramesh Published Date - 08:37 AM, Tue - 20 August 24

చి.ల.సౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహాని శర్మ (Ruhani Sharma) సినిమాల్లో తను చేసే సినిమాలో పాత్రలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. సినిమాల్లో నటన పరంగా అలరిస్తున్న అమ్మడు ఆఫ్ స్క్రీన్ మాత్రం ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. ఐతే రుహాని శర్మ గ్లామర్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. తెలుగులో ఆమెను గ్లామర్ యాంగిల్ లో ఎవరు చూపించలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం అలాంటి అటెంప్ట్ చేసింది. రుహాని శర్మ హిందీలో ఆగ్రా అనే సినిమా చేసింది. ఆ సినిమా లో రుహాని శర్మ బోల్డ్ సీన్స్ లో నటించింది.
తెలుగులో తనకున్న క్లీన్ ఇమేజ్ ని రిస్క్ లో పెడుతూ ఆగ్రా (Agra movie) సినిమాలో రుహాని బోల్డ్ షో అవాక్కయ్యేలా చేసింది. ఐతే ఆ సినిమా రిలీజైనప్పుడు కూడా పెద్దగా హడావిడి లేదు కానీ గత రెండు రోజులుగా రుహాని శర్మ ఆగ్రా లోని కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రుహాని శర్మ ఇంతలా రెచ్చిపోయి మరీ బోల్డ్ సీన్స్ ఎందుకు చేసింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
రుహానికి తెలుగులో మంచి ఇమేజ్ ఉంది. నటిగా తనకు తాను మంచి ఐడెంటిటీ సంపాదించుకుంటుంది. ఐతే ఆగ్రా సినిమాలో ఆమె ఇంత బోల్డ్ గా నటించడం ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఐతే కొంతమంది ఆడియన్స్ అయితే రుహానిలోని ఈ యాంగిల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రుహాని శర్మ బోల్డ్ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐతే సినిమా ఎప్పుడో వస్తే రుహాని శర్మ వీడియోలు ఎందుకు వైరల్ అయ్యాయన్నది మాత్రం అర్ధం కావట్లేదు. ఈ వీడియోలు మార్ఫింగ్ అన్న వారు కూడా ఉన్నారు. కానీ రుహాని శర్మ నటించిన ఆగ్రా సినిమాలో సీన్స్ ఇవని స్పష్టం అవుతుంది. మరి ఈ వీడియోల వల్ల రుహాని శర్మకు ఇమేజ్ పెరుగుతుందా తగ్గుతుందా అన్నది చూడాలి.
Also Read : Shraddha Kapoor Stree 2 : బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ఆడ దెయ్యం..!