RRR on OTT: ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ.. ఎప్పుడంటే?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక మూవీ RRR ట్రైలర్ డిసెంబర్ 9 రిలీజ్ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని థియేటర్లలో కూడా ప్రదర్శించబడింది.
- By Balu J Published Date - 11:48 AM, Sat - 11 December 21

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక మూవీ RRR ట్రైలర్ డిసెంబర్ 9 రిలీజ్ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని థియేటర్లలో కూడా ప్రదర్శించబడింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ముంబైలో ‘ఆర్ఆర్ఆర్’ బృందం మీడియాతో ముచ్చటించింది. మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా RRR హిందీ వెర్షన్ పంపిణీదారు, పెన్ స్టూడియోస్‌కు చెందిన జయంతి లాల్ గడా, మాగ్నమ్ ఓపస్ OTT విడుదల వివరాలను తెలిపారు. ఈ చిత్రం OTT లేదా డిజిటల్ విడుదల గురించి అడిగినప్పుడు జయంతి లాల్ గడ మాట్లాడుతూ, “RRR థియేటర్‌లలో విడుదలైనప్పటి నుంచి కనీసం 90 రోజుల తర్వాత మాత్రమే OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల కానుంది.”
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ZEE5, Netflix తీసుకున్నట్టు సమాచారం. ఈ మూవీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వెర్షన్‌లు ZEE5లో ప్రసారం అవుతాయని, హిందీ, ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్, స్పానిష్ వెర్షన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతాయని మేకర్స్ ఇంతకుముందు వెల్లడించారు. మేకర్స్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. రాజమౌళి, ఆయన టీం మొత్తం సినిమా ప్రమోషన్ కోసం దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలకు వెళ్లనున్నారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ కెరీర్ పరంగా బాగా హెల్ప్ అవుతుంది. నటుడు ఎప్పుడూ ఒకే తరహ సినిమాలు చేయకూడదు. అయితే ఒక నటుడిగా నాకు, రాజమౌళి ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే నా దాహాన్ని తీర్చిన దర్శకుడు” అని ఆయన అన్నారు.
RRR అనేది 20వ శతాబ్దం ప్రారంభంలో ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల గురించి కల్పిత కథను వివరించే ఒక పీరియాడికల్ ఫిల్మ్. అల్లూరి సీతారామ రాజుగా చరణ్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు. అలియా భట్, ఒలివియా మోరిస్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ మరియు సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా వాయిదాల తర్వాత.. RRR జనవరి 7, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.