Raging : కొడుకుపై ర్యాగింగ్.. పోలీసులకు RP పట్నాయక్ ఫిర్యాదు
Raging : శంకర్ పల్లిలోని ICFAI యూనివర్శిటీలో చదువుతున్న వైష్ణవ్‌ను సీనియర్ స్టూడెంట్ ర్యాగింగ్ చేసినట్లు RP పోలీసులకు పిర్యాదు చేసాడు
- By Sudheer Published Date - 08:39 PM, Fri - 27 September 24

ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న తన కుమారుడు వైష్ణవ్ (Vaishnav) ను సీనియర్ లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) పోలీసులకు ఫిర్యాదు చేశారు. RP పట్నాయక్ అంటే తెలియని సినీ లవర్స్ లేరు. 2000వ దశకంలో తన మ్యూజిక్‌తో సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. నీ కోసం మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం మొదలుపెట్టిన RP … చిత్రం, నువ్వు నేను చిత్రాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించి.. వరుస ఆఫర్లు కొల్లగొట్టాడు. మనసంతా నువ్వే హిట్టుతో ఆయన క్రేజ్ పీక్స్‌కు చేరింది. సంతోషం, జయం, జెమినీ, నీ స్నేహం, ప్రభాస్ తొలి మూవీ ఈశ్వర్, దిల్, సంబరం, నిజం ఇలా ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. కేవలం తెలుగు లోనే కాదు ఇటు కన్నడ, తమిళ చిత్రాలకు కూడా మ్యూజిక్ అందించాడు. హీరోగా, నిర్మాత గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల ఎంట్రీ తో RP హావ తగ్గింది.
ఇదిలా ఉంటె.. ఆర్పీ పట్నాయక్ కుమారుడు వైష్ణవ్ ర్యాగింగ్ బారిన పడ్డాడు. శంకర్ పల్లిలోని ICFAI యూనివర్శిటీలో చదువుతున్న వైష్ణవ్‌ను సీనియర్ స్టూడెంట్ ర్యాగింగ్ చేసినట్లు RP పోలీసులకు పిర్యాదు చేసాడు. పలుమార్లు వద్దని చెప్పినా.. అతడిని ఇరిటేట్ చేసాడని.. దీంతో విసుగు చెందిన వైష్ణవ్ యూనివర్శిటీ యాజమాన్యానికి కంప్లయింట్ చేశాడు. ఈ విషయం తెలిసిన సీనియర్.. తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ.. బస్సులో వైష్ణవ్‌తో గొడవపడ్డాడు. కోపంతో రగిలిపోతున్న శ్యామ్.. వైష్ణవ్ చెవి కొరకగా.. తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ విషయం తండ్రి దృష్టికి రావడంతో.. ఆర్పీ పట్నాయక్ వెంటనే రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీనియర్ స్టూడెంట్ శ్యామ్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
Read Also : Acidity: అసిడిటీ, గ్యాస్ బాధలా..? పరిష్కార మార్గాలివే!