Roshan Kanakala : యాంకర్ సుమ కొడుకుతో కలర్ ఫోటో డైరెక్టర్.. కొత్త సినిమా అనౌన్స్..
సుమ కొడుకు రోషన్ కనకాలతో సందీప్ రాజ్ తన రెండో సినిమాని ప్రకటించాడు.
- By News Desk Published Date - 04:17 PM, Sat - 7 September 24

Roshan Kanakala : యాంకర్ సుమ(Suma) తనయుడు హీరోగా బబుల్ గమ్ అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు తన రెండో సినిమానే ప్రకటించాడు. కలర్ ఫోటో(Color Photo) సినిమాతో మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు సాధించాడు దర్శకుడు సందీప్ రాజ్(Sandeep Raj). ఆ తర్వాత రచయితగా పలు సినిమాలకు పనిచేసినా తన దర్శకత్వంలో ఇప్పటివరకు సినిమానే ప్రకటించలేదు.
కలర్ ఫోటో సినిమా వచ్చిన నాలుగేళ్ల తర్వాత తన రెండో సినిమాని నేడు ప్రకటించారు. సుమ కొడుకు రోషన్ కనకాలతో సందీప్ రాజ్ తన రెండో సినిమాని ప్రకటించాడు. నేడు వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ రోషన్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘మౌగ్లీ’ అనే టైటిల్ ప్రకటించారు. పోస్టర్ లో ఒక అడవిలో రోషన్ గుర్రం పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది.
ఈ టైటిల్, పోస్టర్ చూస్తుంటే ఇదేదో అడవిలో తీసే సినిమాలా అనిపిస్తుంది. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు సాధించిన సందీప్ రాజ్ మరి ఈ రెండో సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో TG విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
An enchanting tale of fun, love and heartbreaks that's bound to leave you spellbound💥
Welcome to the world of Murali, alias #Mowgli ❤️🔥#MowgliFirstLook Starring @RoshanKanakala is out now on the auspicious occasion of Ganesh Chaturthi ✨🙏
Get ready for the magical combo to… pic.twitter.com/wg8cSuo5OF
— People Media Factory (@peoplemediafcy) September 7, 2024
Also Read : Game Changer : వినాయక చవితి స్పెషల్ గేమ్ ఛేంజర్ అప్డేట్.. కొత్త పోస్టర్ అదిరింది..