Roshan Kanakala : సుమ – రాజీవ్ కనకాల విడాకుల వార్తలపై మాట్లాడిన రోషన్ కనకాల..
గతంలో సుమ-రాజీవ్(Rajeev Kanakala) లు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీరిపై అనేక రూమర్స్ వచ్చాయి.
- Author : News Desk
Date : 10-12-2023 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
యాంకర్ గా తెలుగు వారి ఇళ్లల్లో ఒకరిగా కలిసిపోయింది సుమ కనకాల(Suma Kanakala). దాదాపు ఇరవై ఏళ్లుగా టీవీ యాంకర్ గా, సినిమా ఈవెంట్స్ లో హోస్ట్ గా, సినిమాల్లో నటిగా, యూట్యూబ్, సోషల్ మీడియాలో.. అన్నిట్లో యాక్టివ్ గా ఉంటూ అన్ని తరాల వాళ్ళని మెప్పిస్తుంది సుమ. సుమ భర్త, అత్తామామ.. ఫ్యామిలీ అంతా నటులే. త్వరలో సుమ తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అయితే గతంలో సుమ-రాజీవ్(Rajeev Kanakala) లు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీరిపై అనేక రూమర్స్ వచ్చాయి. దీనిపై గతంలోనే వీరిద్దరూ స్పందించి అవన్నీ కేవలం రూమర్స్ అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా సుమ – రాజీవ్ విడాకుల వార్తలపై వారి తనయుడు రోషన్ స్పందించాడు. రోషన్ తన మొదటి సినిమా ‘బబుల్ గమ్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోషన్ మాట్లాడుతూ.. అమ్మానాన్న విడాకులు తీసుకుంటున్నారని గతంలో ఓ సారి బాగా వార్తలు వచ్చాయి. ఓ రోజు ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఆ వార్తలు చదువుతూ మీరు విడాకులు తీసుకుంటున్నారా అని డైరెక్ట్ గా అడిగేశాను. వాళ్ళు ఛీ..ఛీ.. అలాంటిదేమీ లేదు. అవన్నీ ఫేక్ వార్తలు అని చెప్పారు. ఆ తర్వాత కూడా ఇలాంటి వార్తలు చదివాను. ఇవన్నీ అబద్దం వార్తలు అని తర్వాత అర్థమైంది. అయినా అలాంటిదేమైనా ఉంటే ముందు ఇంట్లో ఉన్న మాకు తెలుస్తుంది కదా, మాకు తెలియకుండా బయటి వాళ్లకి ఎలా తెలుస్తుంది అని అనుకున్నాను. వాళ్ళ మీద వచ్చిన వార్తల్లో నిజం లేదు. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తప్ప, వాళ్ళ మధ్య విడిపోయేంత గొడవలు లేవు అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో రోషన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Nayanthara : తమిళనాడులో సూపర్ స్టార్ వివాదం.. నయనతార ఏమందంటే?