Hyper Aadi : హైపర్ ఆది నిజస్వరూపం ఇదే- రైజింగ్ రాజు
జబర్దస్త్‌లో ఐదారు టీమ్‌లు ఉన్నా కూడా షో అంటే హైపర్ ఆదీ అన్నట్టే తయారైంది. నలుగురైదుగురిమీద వరుస పంచ్‌లు వేస్తూ స్కిట్‌ని నడిపిస్తుంటాడు ఆది.
- By Hashtag U Published Date - 12:42 PM, Tue - 23 November 21

జబర్దస్త్‌లో ఐదారు టీమ్‌లు ఉన్నా కూడా షో అంటే హైపర్ ఆదీ అన్నట్టే తయారైంది. నలుగురైదుగురిమీద వరుస పంచ్‌లు వేస్తూ స్కిట్‌ని నడిపిస్తుంటాడు ఆది. కంటెస్టెంట్‌గా వచ్చి అతి తక్కువ కాలంలో పాపులారిటీ సంపాదించుకున్న అతికొద్దిమంది ఆర్టిస్టుల్లో హైపర్ ఆది ఒకడు. అందుకే అటు ఈటీవీ కానీ ఇటు మల్లెమాల కానీ ఎలాంటి పరిస్ధతుల్లో హైపర్ ఆదిని వదలుకునే ప్రయత్నం చేయదు.
గతంలో చాలా స్కిట్‌లు చేసిన సందర్భాల్లో ఆది వేసిన పంచ్‌లు వివాదాస్పదమయ్యాయి కూడా. నాగబాబు ఉన్న టైమ్‌లో అతనికి ఇష్టంలేనివాళ్లపై ఏదోకటి అనేసి ఇంటిమీద గొడవల వరకు తెచ్చుకున్నాడు. ఆడవాళ్లను ఏదోకటి అనడం, బాడీ షేమింగ్ చేయడం.. వాటినే పంచ్‌లుగా ప్రొజెక్ట్ చేయడం ఓన్లీ జబర్దస్త్ షోకే సాధ్యం అంటే అతిశయోక్తి కాదు. అందుకే.. చాలామంది హైపర్ ఆదికి పాపులారిటీ రాగానే బలుపు పెరిగిపోయిందని అనుకుంటుంటారు.
అయితే, మొట్టమొదటి సారిగా హైపర్ ఆదిలో మరో కోణం బయటకు వచ్చింది. తన టీమ్‌లో ఇంకో లీడర్ అయిన రైజింగ్ రాజు హైపర్ ఆది ఎలాంటివాడో బయటపెట్టాడు. ఆ మధ్యకాలంలో ఆర్నెల్లపాటు టీంలో కనిపించని రాజు.. అలా ఎందుకు జరిగిందో ఓ షోలో వివరణ ఇస్తూ ఏకంగా కంటతడి పెట్టుకున్నాడు. కరోనా సమయంలో తనకు మనవరాలు పుట్టిందని, బయట తిరిగి ఇంటికి వెళ్తే పాపకు ఏమైనా అవుతుందనే భయంతో తాను షోకు వెళ్లలేదని చెప్పాడు. అలాంటి టైమ్‌లో కూడా హైపర్ ఆది తనకు నెలనెలా ఇంటికి పేమెంట్ పంపించాడని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఏది ఏమయినా షోల వరకే కాకుండా నిజజీవితంలో కూడా ఆర్టిస్టులు ఇలా ఒకరికి ఒకరు తోడుంటడం మంచి పరిణామమే! ఆ ప్రోమోను ఈటీవీ అప్‌లోడ్ చేసింది. చూడండి.
Related News

Hyper Aadi : ఏ హీరోని వదిలిపెట్టని హైపర్ ఆది.. ఎన్టీఆర్ నుంచి కిరణ్ వరకు సెన్సేషనల్ కామెంట్స్..!
మైక్ ఇస్తే చాలు మోత మోగించే స్పీచ్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు హైపర్ ఆది. సినిమా ఛాన్స్ లు (Hyper Aadi)