Kantara In United Nations: ఖండాంతరాలు దాటిన ‘కాంతార’ క్రేజ్.. ఐక్యరాజ్యసమితిలో స్పెషల్ షో!
కాంతార సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా.. క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
- Author : Balu J
Date : 16-03-2023 - 3:37 IST
Published By : Hashtagu Telugu Desk
రిషభ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన కాంతార (Kantara) మూవీ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన కాంతార అనేక రికార్డులను కొలగొట్టింది. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా.. కాంతార క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కాంతార మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శుక్రవారం ప్రదర్శన కానుంది. స్క్రీనింగ్ తర్వాత ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో హీరో రిషభ్ శెట్టి మాట్లాడారు. పర్యావరణం, వాతావరణం, పరిరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన మాట్లాడనున్నారు. రిషబ్ ఇప్పటికే జెనీవా చేరుకున్నారు.
అడవులు, పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాలపై ఆధారపడి జీవించే గిరిజనులు, ఆదివాసీల సమస్యలపై ఈ సందర్భంగా రిషభ్ షెట్టి (Rishab Shetty) ఐక్యరాజ్య సమితిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా కథ- యూనివర్సెల్ సబ్జెక్ట్ కావడం వల్లే ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు దీన్ని అధికారికంగా స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సభ్యులందరూ దీనికి హాజరుకానున్నారు. వారితో కలిసి రిషభ్ షెట్టి సినిమాను చూడనున్నారు.
కాంతార సినిమా ఊహించని విధంగా హిట్ కావడంతో కాంతార2 కోసం దేశవ్యాప్తంగా సీని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ (Rishab Shetty) ఇటీవలే కర్ణాటకలోని కోస్టల్ ప్రాంతానికి వెళ్లాడట. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లి, వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక కాంతారకు వచ్చిన క్రేజ్‌తో ప్రీక్వెల్‌ను మరింత గ్రాండ్ స్కేల్‌లో రూపొందించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: Serial Kisser: ముద్దులు పెడతాడు.. పారిపోతాడు, ‘సీరియల్ కిస్సర్’ వీడియో వైరల్