Serial Kisser: ముద్దులు పెడతాడు.. పారిపోతాడు, ‘సీరియల్ కిస్సర్’ వీడియో వైరల్
హీరోయిన్లను పదే పదే ముద్దులు పెట్టే హీరోను ‘సీరియల్ కిస్సర్’ (Serial Kisser) అని పిలుస్తుంటారు.
- Author : Balu J
Date : 16-03-2023 - 2:46 IST
Published By : Hashtagu Telugu Desk
తన సినిమాలన్నింటిలో హీరోయిన్లను పదే పదే ముద్దులు పెట్టే హీరోను ‘సీరియల్ కిస్సర్’ (Serial Kisser) అని పిలుస్తుంటారు. కానీ నిజ జీవితంలోనూ అలాంటివారు ఉంటారంటే ఇదిగో ఒకడున్నాడు అని చెప్పక తప్పదు. ఓ సీరియల్ కిస్సర్ (Serial Kisser) అమ్మాయిలు, మహిళలపై మనసు పారేసుకున్నాడు. రోడ్లపై మహిళలకు బలవంతంగా ముద్దుపెట్టుకుని అక్కడి నుండి పారిపోతున్నాడు. బీహార్‌లో (Bihar)ని జముయ్ జిల్లాలో ఓ మహిళా ఆరోగ్య కార్యకర్తను బలవంతంగా ముద్దుపెట్టుకున్న వీడియో ఒకటి బయటకువచ్చింది. ఈ వీడియో సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఇది ఇప్పటికే ఇంటర్నెట్‌లో వేలసార్లు షేర్ చేయబడింది.
ఈ వీడియోలో వ్యక్తి గోడ దూకి, వెనుక నుండి మహిళ వద్దకు వచ్చి, బలవంతంగా ముద్దు పెట్టుకుని అక్కడి నుండి పారిపోతాడు. మహిళ ఫోన్‌లో మాట్లాడుతుండగా, అతన్ని (Serial Kisser) పట్టుకోవడానికి చాలా కష్టమైంది. బాధితురాలు జాముయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లైంగిక వేధింపుల నేరం కింద వ్యక్తి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ వైరల్ వీడియో నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. స్థానికులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. బీహార్‌లో మహిళలకు భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/UtkarshSingh_/status/1635208847672606721?s=20
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ 110 సెంచరీలు కొట్టేస్తాడు : పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్