Ram Charan : బాక్సర్ కాదు రన్నర్.. RC 16 క్యారెక్టర్ గురించి క్రేజీ అప్డేట్..!
Ram Charan శంకర్ తో గేమ్ చేంజర్ పూర్తి చేయడమే ఆలస్యం రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ హీరోగా సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన పూజా
- Author : Ramesh
Date : 23-03-2024 - 10:40 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Charan శంకర్ తో గేమ్ చేంజర్ పూర్తి చేయడమే ఆలస్యం రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ హీరోగా సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమా లో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ సినిమాలో రాం చరణ్ బాక్సర్ గా కనిపిస్తాడని నిన్న మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. కానీ వాటిలో వాస్తవం లేదని తెలుస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో చరణ్ రన్నర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.
RRR లో రామరాజు పాత్రలో చరణ్ చూపించిన బాడీ స్టామినా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆర్సీ 16 కోసం కూడా అదే రేంజ్ లో కష్టపడేందుకు సిద్ధం అవుతున్నాడు రాం చరణ్. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది.
అంతేకాదు మలయాళ యువ హీరో ఆంటోని వర్గీస్ కూడా చరణ్ బుచ్చి బాబు కాంబో సినిమాలో నటిస్తున్నాడట. సినిమాలో భారీ కాస్టింగ్ ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తానికి ఉప్పెన తర్వాత బుచ్చి బాబు నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్స్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించడం స్పెషల్ గా చెప్పుకోవచ్చు.
Also Read : Naga Chaitanya : అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న తండేల్ వర్కింగ్ స్టిల్స్..!