HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ray Deeman Come To You The Child Of The Greens The Child Of Ritu In The Middle Is Madhuri

Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

  • By Vamsi Chowdary Korata Published Date - 12:01 PM, Fri - 17 October 25
  • daily-hunt
Bigg Boss Pavan Ramya Rithu
Bigg Boss Pavan Ramya Rithu

బిగ్‌బాస్ హౌస్‌లో పచ్చళ్ల పాప (రమ్య మోక్ష) తనదైన మార్క్ చూపిస్తుంది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు డీమాన్‌తో కాస్త కోపంగా మాట్లాడుతూ కనిపించిన రమ్య.. నెమ్మదిగా ఇప్పుడు దగ్గరవుతుంది. రెండురోజులుగా రీతూ గురించి డీమాన్‌కి రమ్య నెగెటివ్‌గా చెప్తుంది. తన వల్లే నీ గేమ్ పోతుంది.. నిన్ను గేమ్ కోసం వాడుకుంటుంది అన్నట్లుగా డీమాన్‌కి చెప్పింది రమ్య. ఇక లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో తన మనసులో మాట బయటపెట్టేసింది. డీమాన్ మాట్లాడాలని పిలవడంతో రమ్య ఒంటరిగా వెళ్లింది. ఇప్పుడు చెప్పు ఏంటి.. ఇప్పుడు చెప్పు.. అని రమ్య అడిగితే అటు (రీతూ) సైడ్ నుంచి జెన్యూన్ అని ఏం అనిపించలేదా.. అని డీమాన్ అడిగాడు. చాలా బ్యాడ్ ఉంది బయట ఓకేనా.. అంతకుమించి నేను ఏం చెప్పను.. నువ్వు ఏడ్చావ్ కదా ఇందాక.. చూశాను.. ఏడ్చావ్. నువ్వు లవ్వులు ఆడటానికి రాలేదు ఓకేనా.. అంటూ క్లాస్ పీకింది రమ్య. నేను లవ్ చేయడం లేదు.. 100 పర్సంట్.. అని డీమాన్ అన్నాడు. నాకు తెలిసిపోయింది నీ కళ్లు చూస్తే.. నీ ఏడుపు చూస్తేనే అర్థమైపోయింది నాకు నువ్వు లవ్ చేస్తున్నావని.. అంటూ రమ్య ఆటపట్టించింది. నేను ప్రియ కోసం ఏడ్చాను.. అని డీమాన్ అన్నాడు. నువ్వు ఇప్పుడు ఏడుస్తూ అడిగావ్.. నేను చూశాను.. కెమెరాలు ఉన్నాయి ఓవరాక్షన్ చేయకు.. అని రమ్య అంది.

నేను దీని గురించి అయితే 100 పర్సంట ఏడవలేదు.. నేను అయితే లవ్ చేయట్లేదు.. అని డీమాన్ అన్నాడు. “ఆ అమ్మాయి జెన్యూనా ఏంటి అనేది ఆ అమ్మాయికి తెలియాలి నాకు సంబంధం లేదు.. బయట ఏం జరిగింది అనేది మాత్రమే నేను చెప్తున్నాను.. అని రమ్య అంది. అందరూ వీడు ఫూల్.. తింగరోడు అని మాట్లాడుకుంటున్నారా.. అని డీమాన్ అడిగాడు. హా నేను నామినేషన్‌లో మరి ఆ పాయింట్ ఎందుకు చెప్తాను.. నాకు నువ్వు బకరా.. ఎమోషనల్ ఫూల్ అని అనిపిస్తున్నావ్.. నాకు అనిపించింది ఇంకా చాలా మందికి.. నేను ఏమన్నా తప్పు చెప్పానా నీ గేమ్ మీద ఫోకస్ చెయ్ అనే కదా చెప్పాను.. దానికి ఏం ఇబ్బంది అవుతుందో అది నీ ముందు తీసుకొచ్చి పెట్టా.. నీ ఫ్రెండ్స్ చూస్తుంటారు ఇప్పుడు ఇది.. హమ్మయ్య కనీసం తిను అయినా చెప్పింది అనుకుంటారు..” అని రమ్య సలహాలు ఇచ్చింది. ఇది జరిగిన కాసేపటికి గార్డెన్ ఏరియలో మళ్లీ రమ్యతో పులిహోర కలిపాడు డీమాన్. అయితే ఆ పక్కనే మాధురి కూడా కూర్చొని ఉంది టీజ్ చేస్తున్నావా రీతూని.. అని డీమాన్ అడిగితే రీతూని నేను ఎందుకు టీజ్ చేస్తాను.. బాబోయ్ నువ్వు ఇంకా చాలా డీప్‌గా ఆలోచించావ్.. అని రమ్య నవ్వింది.

ఇంతలో ఏంటి స్పెషల్‌గా మాట్లాడుతున్నావ్ వీడితో.. అని రమ్యని అడిగింది మాధురి. స్పెషల్ ఏముంది కూర్చో ఖాళీగా ఉన్నావ్ కదా అని.. అంటూ రమ్య ఆన్సర్ ఇచ్చింది. నీకు ఈ హౌస్‌లో అందరికన్నా ఎవరు నచ్చారు.. అంటూ రమ్యని అడిగింది మాధురి. నాకా నచ్చుతారేమో నచ్చుతారేమో.. అంటూ రమ్య సిగ్గుపడిపోయింది. దీంతో ఎక్కడో సుడి ఉందిరా నీకు.. అంటూ డీమాన్‌ని చూస్తూ నవ్వింది మాధిరి. ఇక్కడే ఉంది ఇంకెక్కడా లేదు.. అంటూ తల చూపించాడు డీమాన్. ఇద్దరూ జిమ్మర్స్.. ఇంకేంటి అంటూ ఆటపట్టించింది మాధురి. అలా ఏం లేదండీ మేము వర్కవుట్‌యే చేయలేదు ఇప్పటివరకూ.. అని డీమాన్ అంటుంటే రేపటి నుంచి మొదలుపెడదాం.. అని రమ్య నవ్వింది. ఇక నీకు ఎవరు నచ్చారు ఈ హౌస్‌లో.. అని డీమాన్‌ని అడిగింది మాధురి. ఆళ్లే మీ ఫ్రెండ్, మీరు.. అంటూ డీమాన్ అన్నాడు. మధ్యలో రమ్య ఏమో.. ఇంకెవరూ పవన్ చాలా ఇన్నోసెంట్ నాకు పవన్‌యే ఇష్టం.. అంటూ చెప్పింది. దీనికి ప్రాంక్.. అంటూ డీమాన్ నవ్వాడు. ప్రాంక్ ఏంట్రా ప్రాంక్.. ప్రాంక్‌లు చేస్తారేంటి ఇలాంటి విషయాల్లో.. అంటూ మాధురి తిట్టింది. ఏదో పిచ్చోడు అలా మాట్లాడతాడు..అని రమ్య నవ్వింది.

మరోవైపు తనూజ బెడ్డు మీద కూర్చొని సాయి ముచ్చట పెట్టాడు. ఆ అమ్మాయికి (రమ్య) ముందు నుంచి ఉంది డీమాన్ మీద.. అని సాయి చెబుతుంటే లవ్వా.. అని తనూజ అడిగింది. నాకు తెలీదు అక్కడిదాకా.. క్రష్ అవ్వొచ్చు ఏమైనా అవ్వొచ్చు.. ఇప్పుడదే డిస్కషన్.. తనకి డీమాన్ మీద ఇంట్రెస్ట్ ఉంది.. అంతే.. అని సాయి చెప్పాడు. అందుకే రీతూ అప్సెట్‌గా ఉందా.. అని తనూజ అడిగింది. ఏమో నాకు రీతూ సంగతి తెలీదు.. ఇది తను నాకు ఎక్స్‌ప్రెస్ చేయకముందే నాకు తెలుసు.. రమ్య.. ఎవరికీ చేయలేదు ఇంకా.. అని సాయి అన్నాడు. సరే అయితే మార్నింగ్ నుంచి ఫోకస్ పెడతా.. అంటూ తనూజ చెప్పింది. ఇక ఉదయం కాగానే వాష్‌రూమ్ ఏరియా దగ్గర డీమాన్‌తో రీతూ మాట్లాడింది. మాధురి గారు నీతో చెప్పలేదా.. రీతూతో మాట్లాడకూడదు రీతూతో ఉండకూడదు అప్పుడే నీకు సేవింగ్ ఆప్షన్ ఉపయోగిస్తానని.. అని డీమాన్‌ని అడిగింది. చెప్పారు.. కానీ నేను ఏం చెప్పాను తెలీదా నీకు.. అని డీమాన్ అడిగాడు. తెలీదు అది చెప్పలేదు నాకు.. అని రీతూ అంది. డీమాన్ సైలెంట్‌గా ఉండేసరికి అడిగినప్పుడు చెప్పవ్ చిరాకుగా.. అని రీతూ ముఖం తిప్పుకుంది. ఇలాంటివి నాకు నేను ఏం చెప్పుకుంటాను ఇమ్మూని అడుగు.. అని డీమాన్ అన్నాడు. వాడు కూడా చెప్పట్లేదు నువ్వు చెప్పు అని రీతూ బతిమాలింది. నేను వద్దన్నాను అలాగైతే.. . అలా అయితే నన్ను సేవ్ చేయొద్దని చెప్పాను.. అని డీమాన్ చెప్పగానే రీతూ పరిగెత్తుకుంటూ వచ్చి డీమాన్‌ని హత్తుకొని బుగ్గ మీద కిస్ కొట్టింది. దీంతో అవాక్కైన డీమాన్.. ఏందిరా అయ్యా కలికాలం.. అంటూ సిగ్గుపడిపోయాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BIG BOSS
  • big boss seanson telugu
  • Demon Pavan
  • Divvala Madhuri
  • ramya
  • rithu chowdary
  • star maa
  • Star Maa Bigg Boss
  • thanuja

Related News

    Latest News

    • Nara Lokesh : కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం

    • UIDAI : కొత్త ఆధార్ యాప్ ను తీసుకొచ్చిన UIDAI ..ఇక అన్ని మీ ఫోన్లోనే !!

    • Hero HF Deluxe : బడ్జెట్ ధరలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ..ఫీచర్లు మాములుగా లేవు

    • Telangana Youth : తెలంగాణ యువతకు గొప్ప శుభవార్త

    • Alcohol : ఏపీలో రోడ్డుపై ఫ్రీ గా మద్యం..మందుబాబులు ఆగుతారా..!!

    Trending News

      • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd