Raviteja 75 : రవితేజ 75.. మాస్ రాజా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే అప్డేట్..!
Raviteja 75 మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా
- By Ramesh Published Date - 11:20 AM, Mon - 10 June 24

Raviteja 75 మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత రవితేజ ఓ పక్క అనుదీప్ కెవితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అనుదీప్ సినిమా తో పాటుగా సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను బోగవరపు తో మరో సినిమా లాక్ చేసుకున్నాడు రవితేజ.
సామజవరగమన సినిమాతో తన రైటింగ్ టాలెంట్ చూపించిన భాను రవితేజ కోసం ఒక అదిరిపోయే కథ సిద్ధం చేశాడట. ఈ సినిమా షెడ్యూల్ త్వరలో మొదలవుతుందని తెలుతుంది. రవితేజ 75వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది.
మాస్ మహరాజ్ రవితేజ సినిమాల లైంప ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. మిస్టర్ బచ్చన్ ఇంకా పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలు చేయడం మాస్ రాజా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్స్ గా ఈ సినిమాలు రానున్నాయి. మరి ఈ సినిమాలతో రవితేజ ఏమేరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
Also Read : Balakrishna Boyapati Srinu : BB4.. మాస్ జాతర మొదలు..!