HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Ravi Teja Vamsee Abhishek Agarwal Arts Pan Indian Film Tiger Nageswara Rao Grand Launching Pre Look On April 2nd

Ravi Teja: ఉగాది కానుకగా ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రీ లుక్

మాస్ మహారాజా రవితేజ తన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.

  • By Balu J Published Date - 02:56 PM, Thu - 31 March 22
  • daily-hunt
Tiger Nagesh
Tiger Nagesh

మాస్ మహారాజా రవితేజ తన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఉగాది రోజున (ఏప్రిల్ 2న) మాదాపూర్ లోని నోవాటెల్లో (హెచ్ఐసిసిలో) టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా గురువారంనాడు తెలియజేసింది. పాన్ ఇండియా చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్`తో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్.

టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ సినిమా. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, సాహసోపేతమైన స్టువర్ట్పురం నాగేశ్వరరావు కథ. అక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రం. పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు రవితేజ పూర్తిగా తనను తాను మలుచుకోనున్నాడు. అందుకు తగిన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనబడనున్నాడు. దర్శకుడు వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది. ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథ రవితేజకు పర్ఫెక్ట్ సినిమా. మాస్ ఆధారిత పాత్రలు పోషించడంలో ఆయన ప్రత్యేకతను సంతరించుకున్నాడు.

ఈ సినిమా టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించి ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచింది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లతో నిండిన ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. 1970 నాటి కథ కావడంతో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఇది విజువల్ గా చాలా అద్భుతంగా ఉండేలా ఆర్. మది ISC కెమెరా బాధ్యతలు చేపట్టారు. GV ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరించనున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

తారాగణం: రవితేజ
రచయిత, దర్శకుడు: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పకుడు: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీత దర్శకుడు: జివి ప్రకాష్ కుమార్
DOP: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • pan india movie
  • Ravi teja
  • Tiger Nageswara Rao

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd